ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల కాగా.. తాజాగా హైదరాబాద్ లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ (SPP) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (SSP Job Notification) విడుదల చేసింది. మొత్తం 83 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జూనియర్ టెక్నీషియన్, ఫైర్ మ్యాన్ పోస్టులు ఈ ఖాళీల్లో ఉన్నాయి. ప్రింటింగ్/కంట్రోల్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్, ఫైర్ మెన్ విభాగాల్లో ఈ ఖాళీలు (Jobs) ఉన్నాయి.
ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..
పోస్టు | ఖాళీలు |
జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/కంట్రోల్) | 68 |
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్) | 06 |
జూనియర్ టెక్నీషియన్ (టర్నర్) | 01 |
జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్) | 01 |
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) | 03 |
జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్) | 03 |
ఫైర్ మెన్ | 01 |
మొత్తం: | 83 |
విద్యార్హతలు: వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టుల ఆధారంగా టెన్త్ సంబంధిత స్పెషలైజేషన్లలో ఐటీఐ/డిప్లొమా విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. వయోపరిమితిని 18-25 ఏళ్లుగా నిర్ణయించారు.
Job Mela: ఏపీలో ఎల్లుండి మరో జాబ్ మేళా.. 3 కంపెనీల్లో 200 జాబ్స్ .. ఇలా రిజిస్టర్ చేసుకోండి
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ (https://spphyderabad.spmcil.com/Interface/AboutOurLogo.aspx) ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో Discover SPMCIL విభాగంలోని Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: అక్కడ ముందు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
Step 5: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన వివరాలు:
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 30 అంటే ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.600 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.