news18-telugu
Updated: February 4, 2020, 11:15 AM IST
Jobs: స్పోర్ట్స్ అథారిటీలో 347 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-SAI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్పోర్ట్స్ సైంటిస్ట్, పారామెడికల్ స్టాఫ్, స్పోర్ట్స్ మెడిసిన్ సిబ్బందిని నియమిస్తోంది. మొత్తం 347 ఖాళీలను ప్రకటించింది. ఆంథ్రోపోమెట్రిస్ట్, ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ ఎక్స్పర్ట్, బయోమెకానిస్ట్, సైకాలజిస్ట్, బయోకెమిస్ట్, స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్, పిజియోథెరపిస్ట్, ఫార్మాసిస్ట్, నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ లాంటి పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్
https://sportsauthorityofindia.nic.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 15 చివరి తేదీ.
Sports Authority of India Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
ఆంథ్రోపోమెట్రిస్ట్- 23
ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్- 34
స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ ఎక్స్పర్ట్- 62
బయోమెకానిస్ట్- 3
సైకాలజిస్ట్- 4బయోకెమిస్ట్- 2
స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్- 11
పిజియోథెరపిస్ట్- 47
మాసర్- 72
ఫార్మాసిస్ట్- 12
నర్సింగ్ అసిస్టెంట్- 36
ల్యాబ్ టెక్నీషియన్ (మెడికల్ ల్యాబ్స్)- 12
ల్యాబ్ టెక్నీషియన్ (నాన్ మెడికల్)- 29
Sports Authority of India Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటలు
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 111 జాబ్స్... అప్లికేషన్ ఫామ్ లింక్ ఇదే
Police Jobs: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ డిపార్ట్మెంట్లో 15,000 ఖాళీలు
RRB NTPC Exam: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్‌పై క్లారిటీ వచ్చినట్టేనా?
Published by:
Santhosh Kumar S
First published:
February 4, 2020, 10:50 AM IST