SAI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 320 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20న ప్రారంభం కానుంది.

  • Share this:
    స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగా ప్రకటనలు విడుదలవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. కోచ్, అసిస్టెంట్ కోచ్ విభాగాల్లో దాదాపు 320 ఖాళీల భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో కోచ్ పోస్టులు 100, అసిస్టెంట్ కోచ్ పోస్టులు 220 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20న ప్రారంభం కానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 20లోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. కోచ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.1,05,000-రూ. 1,50,000 వరకు వేతనం చెల్లించనున్నారు. అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.41,420 వేల నుంచి రూ.1,12,400 వరకు వేతనం చెల్లించనున్నారు.
    NTPC Recruitment 2021: మహిళల కోసం ఎన్టీపీసీ నుంచి స్పెషల్ జాబ్ నోటిఫికేషన్.. ఆ స్కోర్ ఉంటే చాలు.. వివరాలివే
    DRDO Apprentice Recruitment 2021: డీఆర్డీఓలో అప్రంటీస్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ లేకుండా కేవలం మార్కుల ఆధారంగానే ఎంపిక..

    విద్యార్హతల వివరాలు..
    కోచ్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు SAI, NS NIS లేదా గుర్తింపు పొందిన ఇతర ఏ ఇండియన్/ఫారెన్ యూనివర్సిటీలో కోచింగ్ లో డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఒలంపిగ్ గేమ్స్ లో మెడల్ విన్నర్ కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత లేదా ఒలంపిక్ లో రెండు సార్లు పాల్గొన్న వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    అసిస్టెంట్ కోచ్: SAI, NS NIS లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కోచింగ్ లో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. ఒలంపిక్ లేదా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారు లేదా ద్రోణాచార్య అవార్డు గ్రహీత కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు.

    వయో పరిమితి:
    కోచ్: 45 ఏళ్లు
    అసిస్టెంట్ కోచ్-40 ఏళ్లు
    Official Website- Direct Link
    Official Notification1- Direct Link
    Official Notification2- Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 20 వరకు అధికారిక వెబ్ సైట్లో ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే ఏప్రిల్ 20 వ తేదీ నుంచి అప్లికేషన్ లింక్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉండనుంది. అప్లికేషన్లను సబ్మిట్ చేసిన అనంతరం అభ్యర్థులు ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: