హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SAI Recruitment: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 220 అసిస్టెంట్ కోచ్​ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

SAI Recruitment: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 220 అసిస్టెంట్ కోచ్​ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

సాయ్‌లో అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల (PC: SAI)

సాయ్‌లో అసిస్టెంట్ కోచ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల (PC: SAI)

క్రీడాప్రాధికార సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​) వివిధ క్రీడాంశాల్లో 220 అసిస్టెంట్​ కోచ్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది.

క్రీడా ప్రాధికార సంస్థ.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్​) (Sports Authority of India) వివిధ క్రీడాంశాల్లో 220 అసిస్టెంట్​ కోచ్ (Coach)​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ (Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ (Online Application) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఎంపికైన వారిని​ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 4 సంవత్సరాల పాటు అసిస్టెంట్​ కోచ్​గా నియమించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్​ వ్యవధిని పొడిగిస్తారు. అభ్యర్థులు అక్టోబర్ 10లోపు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు

క్రమ సంఖ్యక్రీడా విభాగంపోస్టుల సంఖ్య
1ఆర్చరీ13
2అథ్లెటిక్స్20
3బాక్సింగ్13
4సైక్లింగ్13
5ఫెన్సింగ్13
6ఫుట్‌బాల్10
7జిమ్నాస్టిక్స్6
8హ్యాండ్ బాల్3
9బాస్కెట్‌బాల్6
10హాకీ13
11జూడో13
12కబడ్డీ5
13కరాటే4
14కయాకింగ్ అండ్ కనోయింగ్6
15ఖోఖో2
16రోయింగ్13
17సెపక్ తక్రా5
18షూటింగ్3
19సాఫ్ట్ బాల్1
20స్విమ్మింగ్7
21టేబుల్ టెన్నిస్7
22తైక్వాండో6
23వాలీబాల్6
24వెయిట్ లిఫ్టింగ్13
25రెజ్లింగ్13
26వుషు6


పైన పేర్కొన్న మొత్తం 220 పోస్టుల్లో జనరల్​ అభ్యర్థులకు 90, ఈడబ్ల్యూఎస్​కు 22, ఓబీసీలకు 59, ఎస్​సీలకు 33, ఎస్టీలకు 16 పోస్టులను రిజర్వ్ చేసినట్లు సాయ్ పేర్కొన్నది.

అర్హత ప్రమాణాలు

అభ్యర్థులు SAI, NS NIS లేదా ఏదైనా ఇతర గుర్తింపు పొందిన భారతీయ/ విదేశీ విశ్వవిద్యాలయం నుండి సంబంధిత క్రీడాంశంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఒలింపిక్/ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని ఉండాలి. లేదంటే ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయి ఉండాలి. 40 ఏళ్లలోపు వయస్సు గల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థులు ఆన్​లైన్​లో సమర్పించిన డాక్యుమెంట్స్​ను పరిశీలించి ఆధారంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మెరిట్ లిస్ట్​ సిద్ధం చేస్తుంది. షార్ట్​ లిస్ట్​ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఈ నోటిఫికేషన్​ ద్వారా మొత్తం 26 క్రీడా విభాగాల్లో అసిస్టెంట్​ కోచ్​లను భర్తీ చేయనుంది.

First published:

Tags: Job notification, Sports

ఉత్తమ కథలు