Home /News /jobs /

SPMCIL RECRUITMENT 2021 SECURITY PRINTING AND MINTING CORPORATION OF INDIA HYDERABAD RELEASED JOB NOTIFICATION FOR 15 POSTS SS

SPMCIL Recruitment 2021: హైదరాబాద్‌లోని మింట్‌లో ఉద్యోగాలు... రూ.95,000 వరకు వేతనం

SPMCIL Recruitment 2021: హైదరాబాద్‌లోని మింట్‌లో ఉద్యోగాలు... రూ.95,000 వరకు వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)

SPMCIL Recruitment 2021: హైదరాబాద్‌లోని మింట్‌లో ఉద్యోగాలు... రూ.95,000 వరకు వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

SPMCIL Recruitment 2021 | నిరుద్యోగులకు అలర్ట్. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఖాళీల సంఖ్య, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.

    సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఈ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్‌లో ఉంది. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. సూపర్‌వైజర్, ల్యాబరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 27 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

    SPMCIL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...





























    మొత్తం ఖాళీలు15విద్యార్హతలువేతనం
    సూపర్‌వైజర్4కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్ టైమ్ బీఈ, బీటెక్, డిప్లొమా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి.రూ.27,600 బేసిక్ వేతనంతో మొత్తం రూ.95,910
    ల్యాబరేటరీ అసిస్టెంట్8కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌గా బీఎస్‌సీ 55 శాతం మార్కులతో పాస్ కావాలి.రూ.21,540 బేసిక్ వేతనంతో మొత్తం రూ.77,160
    ఎంగ్రేవర్3స్కల్ప్‌చర్, మెటల్ వర్క్స్‌లో బ్యాచిలర్స్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ 55 శాతం మార్కులతో పాస్ కావాలి.రూ.23,910 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85,570

    UPSC Recruitment 2021: యూపీఎస్‌సీ మరో జాబ్ నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    SPMCIL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 29

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 27

    ఆన్‌లైన్ టెస్ట్- 2022 జనవరి లేదా ఫిబ్రవరి

    ట్రేడ్ టెస్ట్- 2022 మార్చి లేదా ఏప్రిల్

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    వయస్సు- 18 నుంచి 30 ఏళ్లు.

    ఎంపిక విధానం- రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Southern Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

    SPMCIL Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు http://igmhyderabad.spmcil.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

    Step 2- వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉంటాయి.

    Step 3- దరఖాస్తు చేయాలనుకునే పోస్టుపై క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

    Step 4- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 5- ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి లాగిన్ చేయాలి.

    Step 6- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఆరు దశల్లో ఉంటుంది.

    Step 7- మొదటి దశలో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

    Step 8- రెండో స్టేజ్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 9- మూడో దశలో ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

    Step 10- నాలుగో దశలో అప్లికేషన్ వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    Step 11- ఐదో దశలో ఎడమ చేతి వేలి ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.

    Step 12- ఆరో దశలో దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank Jobs, CAREER, Career and Courses, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS, Private Jobs, Railway jobs, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు