• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • SOUTHERN RAILWAY RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR 191 PARAMEDICAL POSTS KNOW VACANCIES SS

Southern Railway: మొత్తం 191 పోస్టుల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్

Southern Railway: మొత్తం 191 పోస్టుల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్

Southern Railway: మొత్తం 191 పోస్టుల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)

Southern Railway Recruitment 2021 | రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. సదరన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    సదరన్ రైల్వే పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 191 పోస్టులున్నాయి. నర్సింగ్ సూపరింటెండెంట్, ఫిజియోథెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, హెమోడయాలిసిస్ టెక్నీషియన్, హాస్పిటల్ అసిస్టెంట్, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, రేడియోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 30 చివరి తేదీ. ఎంపికైన పారామెడికల్ సిబ్బందికి చెన్నైలోని పెరంబూర్‌లో గల హెడ్‌క్వార్టర్స్ రైల్వే హాస్పిటల్‌లో పోస్టింగ్ ఉంటుంది. ఇవి కంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://sr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    Southern Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 191
    నర్సింగ్ సూపరింటెండెంట్- 83
    ఫిజియోథెరపిస్ట్- 1
    ఈసీజీ టెక్నీషియన్- 4
    హెమోడయాలిసిస్ టెక్నీషియన్- 3
    హాస్పిటల్ అసిస్టెంట్- 48
    హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 40
    ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- 9
    రేడియోగ్రాఫర్- 3

    LIC Agent Jobs: ఏడాదిలో 3,45,469 ఎల్ఐసీ ఏజెంట్ల నియామకం... మీరూ దరఖాస్తు చేయండి ఇలా

    IDBI Bank Recruitment 2021: ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Southern Railway Recruitment 2021: వేతనాల వివరాలు ఇవే...


    నర్సింగ్ సూపరింటెండెంట్- రూ.44,900 + డీఏ + ఇతర అలవెన్సులు
    ఫిజియోథెరపిస్ట్- రూ.35,400 + డీఏ + ఇతర అలవెన్సులు
    ఈసీజీ టెక్నీషియన్- రూ.25,500 + డీఏ + ఇతర అలవెన్సులు
    హెమోడయాలిసిస్ టెక్నీషియన్- రూ.35,400 + డీఏ + ఇతర అలవెన్సులు
    హాస్పిటల్ అసిస్టెంట్- రూ.18,000 + డీఏ + ఇతర అలవెన్సులు
    హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- రూ.18,000 + డీఏ + ఇతర అలవెన్సులు
    ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2- రూ.21,700 + డీఏ + ఇతర అలవెన్సులు
    రేడియోగ్రాఫర్- రూ.29,200 + డీఏ + ఇతర అలవెన్సులు

    Exams: కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటివరకు రద్దైన, వాయిదాపడ్డ ఎగ్జామ్స్ ఇవే

    DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    Southern Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30
    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
    ఎంపిక విధానం- టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. అభ్యర్థులు ముందుగా మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. పూర్తిగా ఫిట్‌నెస్ ఉన్నవారికే అవకాశం లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: