హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Southern Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Southern Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Southern Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Southern Railway Jobs: రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Southern Railway Recruitment 2021 | భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి శుభవార్త. సదరన్ రైల్వే పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి అలర్ట్. పలు ఖాళీల భర్తీకి దక్షిణ రైల్వే (Southern Railway) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 30 చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి ఆయా క్రీడల్లో రాణించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, క్రికెట్, పవర్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, వాలీబాల్‌లో రాణించిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, విద్యార్హతల గురించి తెలుసుకోండి.

Southern Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు21
అథ్లెటిక్స్ (మెన్)2
అథ్లెటిక్స్ (వుమెన్)2
బాస్కెట్‌బాల్ (మెన్)4
బాస్కెట్‌బాల్ (వుమెన్)3
క్రికెట్ (వుమెన్)3
పవర్‌లిఫ్టింగ్ (మెన్)1
స్విమ్మింగ్ (మెన్)1
వాలీబాల్ (మెన్)2
వాలీబాల్ (వుమెన్)2


APPSC Recruitment 2021: ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Southern Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 31

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 30

విద్యార్హతలు- లెవెల్ 2, 3 పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా 10+2 పాస్ అయితే చాలు. లెవెల్ 4, 5 పోస్టులకు గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి.

ఇతర అర్హతలు- అభ్యర్థులు నోటిఫికేషన్‌లో వెల్లడించిన క్రీడల్లో రాణించి ఉండాలి. కేటగిరీ ఏలో ఒలింపిక్స్, కేటగిరీ బీలో వాల్డ్ కప్, వాల్డ్ ఛాంపియన్‌షిప్, ఏసియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, కేటగిరీ సీలో కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్, ఏసియన్ ఛాంపియన్‌షిప్, ఆసియా కప్, సౌత్ ఏషియన్ ఫెడరేషన్, వాల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో రాణించిన అభ్యర్తులు దరఖాస్తు చేయొచ్చు.

వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు

దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.250.

వేతనం- ఎంపికైనవారికి ఏడో పే కమిషన్ పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. లెవెల్ 2 ఉద్యోగులకు రూ.19,900, లెవెల్ 3 ఉద్యోగులకు రూ.21,700, లెవెల్ 4 ఉద్యోగులకు రూ.25,500, లెవెల్ 5 ఉద్యోగులకు రూ.29,200 వేతనం లభిస్తుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

APPSC Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి అలర్ట్... ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు

Southern Railway Recruitment 2021: దరఖాస్తు విధానం


Step 1- అభ్యర్థులు సదరన్ రైల్వే రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ https://rrcmas.in/ లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి.

Step 2- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి పూర్తి చేయాలి.

Step 3- విద్యార్హతలు, క్రీడల్లో రాణించిన సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఇతర డాక్యుమెంట్స్ జత చేయాలి.

Step 4- అప్లికేషన్ ఫామ్స్‌ నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Assistant Personnel Officer,

Railway Recruitment Cell,

Southern Railway,

3rd Floor, No 5 Dr.P.V.Cherian Crescent Road,

Egmore, Chennai – 600 008.

First published:

Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railway jobs, Railways

ఉత్తమ కథలు