news18-telugu
Updated: August 10, 2020, 6:31 PM IST
Railway Jobs: సదరన్ రైల్వేలో 201 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా వైరస్ సంక్షోభం కారణంగా భారతీయ రైల్వే తాత్కాలిక పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. సదరన్ రైల్వే 201 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. పారామెడికల్ సిబ్బంది, కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 201 పోస్టుల్ని ప్రకటించింది. నర్సింగ్ స్టాఫ్, ఫార్మాసిస్ట్, హాస్పిటల్ అటెండెంట్, రేడియోగ్రాఫర్, హౌజ్ కీపింగ్ అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. రైల్వే ఆస్పత్రిలో వీరిని నియమించనుంది. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ గడువును పొడిగిస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://sr.indianrailways.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
Southern Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 201
జీడీఎంఓ- 27
స్పెషలిస్ట్- 9 (అనెస్థీటిస్ట్- 3, ఫిజీషియన్- 3, చెస్ట్ ఫిజీషియన్- 3)
నర్సింగ్ స్టాఫ్- 32
హాస్పిటల్ అటెండెంట్- 39ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్- 10
రేడియోగ్రాఫర్- 12
ఫార్మాసిస్ట్- 10
హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 69
Southern Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 14
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- డాక్టర్‌కు 53 ఏళ్ల లోపు, నర్సింగ్ స్టాఫ్‌కు 20 నుంచి 40 ఏళ్లు, హాస్పిటల్ అటెండెంట్, సఫాయివాలా పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, ల్యాబ్ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఫార్మాసిస్ట్ పోస్టులకు 18 నుంచి 33 ఏళ్లు.
దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్ ఐడీ: tpicovidcontractaugh@gmail.com
Published by:
Santhosh Kumar S
First published:
August 10, 2020, 6:31 PM IST