Railway Jobs: 2393 ఉద్యోగాల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్

Southern Railway Jobs | ట్రాక్‌మ్యాన్, హెల్పర్ (ట్రాక్ మెషీన్), హెల్పర్ (టెలీ), హెల్పర్ (సిగ్నల్), పాయింట్స్‌మ్యాన్ బీ, హెల్పర్ (C&W), హెల్పర్ / డీజిల్ మెకానికల్,హెల్పర్ / డీజిల్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది.

news18-telugu
Updated: August 16, 2019, 10:16 AM IST
Railway Jobs: 2393 ఉద్యోగాల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్
Railway Jobs: 2393 ఉద్యోగాల భర్తీకి సదరన్ రైల్వే నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 16, 2019, 10:16 AM IST
సదరన్ రైల్వే మొత్తం 2393 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రాక్‌మ్యాన్, హెల్పర్, పాయింట్స్‌మ్యాన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది సదరన్ రైల్వే. వీటి కోసం ఎక్స్-సర్వీస్‌మెన్‌ నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 2019 సెప్టెంబర్ 12 లోగా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. బ్రిడ్జి ఆర్గనైజేషన్, ట్రాక్ మెషీన్ ఆర్గనైజేషన్ లాంటి టెక్నికల్ సేఫ్టీ కేటగిరీల్లో లెవెల్ 1 లో భర్తీ చేస్తున్న ఈ ఖాళీలన్నీ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ పోస్టులే. వీటికి ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. www.rrcmas.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలున్నాయి. 2393 ఖాళీల భర్తీకి సదరన్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Southern Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే


మొత్తం ఖాళీలు: 2393

ఖాళీ ఉన్న పోస్టులు: ట్రాక్‌మ్యాన్, హెల్పర్ (ట్రాక్ మెషీన్), హెల్పర్ (టెలీ), హెల్పర్ (సిగ్నల్), పాయింట్స్‌మ్యాన్ బీ, హెల్పర్ (C&W), హెల్పర్ / డీజిల్ మెకానికల్,హెల్పర్ / డీజిల్ ఎలక్ట్రికల్.
దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 13
దరఖాస్తు ముగింపు: 2019 సెప్టెంబర్ 12 సాయంత్రం 5 గంటలు


వయస్సు: 2019 ఆగస్ట్ 31 నాటికి గరిష్టంగా 50 ఏళ్లు
అర్హత: 15 ఏళ్లు సేవలు అందించి రిటైరైన ఎక్స్-సర్వీస్‌మెన్, ఆర్మీ క్లాస్-1 సర్టిఫికెట్ పాసైన వాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం సాయుధ దళాల్లో పనిచేస్తున్నవాళ్లు అర్హులు కాదు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే...

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి...
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...