హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Southern Railway: గుడ్‌న్యూస్‌.. పది, ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

Southern Railway: గుడ్‌న్యూస్‌.. పది, ఇంటర్ అర్హతతో రైల్వేలో భారీగా ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Southern Railway: పదో తరగతి, ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన వారికి గుడ్ న్యూస్. ఎంట్రెన్స్ పరీక్ష లేకుండానే గవర్నమెంట్ ఉద్యోగం పొందే చక్కటి అవకాశాన్ని ఇండియన్ రైల్వేస్‌ కల్పించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పదో తరగతి, ఇంటర్, ఐటీఐ పూర్తిచేసిన వారికి గుడ్ న్యూస్. ఎంట్రెన్స్ పరీక్ష (Entrance Exam) లేకుండానే గవర్నమెంట్ ఉద్యోగం పొందే చక్కటి అవకాశాన్ని ఇండియన్ రైల్వేస్‌ (Indian Railways) కల్పించింది. తాజాగా సదరన్ రైల్వే (Southern Railway) వివిధ విభాగాల్లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు సదరన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ sr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 1343 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 31గా నిర్ణయించారు.

* అర్హత ప్రమాణాలు

ఎలక్ట్రీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. సబ్జెక్టులలో సైన్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ITI ఇన్‌స్టిట్యూట్‌లో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ కోర్సు చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా పదో తరగతి కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

సైన్స్ (ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ), మ్యాథమెటిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐటీఐ ఇన్ స్టిట్యూట్ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ కోర్సు చేసి ఉండాలి ఫిట్టర్, పెయింటర్ & వెల్డర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కనీసం పదో తరగతి ( మినిమం 50% మొత్తం మార్కులతో) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా అందుకు సమానమైన కోర్సు చేసి ఉండాలి.

PASAA పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌లో వృత్తి శిక్షణ కోసం నేషనల్ కౌన్సిల్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ, పాథాలజీ, కార్డియాలజీ) పోస్టులకైతే తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలి.

ఫిట్టర్, మెషినిస్ట్, MMV, టర్నర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, ట్రిమ్మర్, వెల్డర్(G&E), వైర్‌మ్యాన్, అడ్వాన్స్ వెల్డర్ & R&AC పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి.

* వయసు

అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నిండి ఉండాలి. ఎంఎల్‌టీలో ఫ్రెషర్స్/ఎక్స్-ఐటీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు వరుసగా 22/24 సంవత్సరాల లోపు ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బెంచ్‌మార్క్ వైకల్యం (PwBD) ఉన్న వ్యక్తులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

* దరఖాస్తు రుసుము

జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

* సదరన్ రైల్వే రిక్రూట్‌మెంట్- ఖాళీల వివరాలు

ఫ్రెషర్స్‌కి 110 పోస్టులు, ఎక్స్-ఐటీఐ కేటగిరి అభ్యర్థులకు 1233 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

* ఎంపిక ప్రక్రియ

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది మెరిట్ జాబితాను రూపొందించనుంది. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్/ ITI కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను తయారు చేయనుంది.

* జీతభత్యాలు

పదో తరగతి చదివిన వారు ఉద్యోగాలకు ఎంపికైతే వారికి నెలకు రూ.6000 జీతం లభించనుంది. ఇక ఇంటర్, ఐటీఐ కోర్సులు చేసిన వారికి రూ. 7000 జీతం లభిస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government Jobs, Indian Railway, JOBS, Railway jobs

ఉత్తమ కథలు