Railway Jobs: సదరన్ రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Southern Railway Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 18 చివరి తేదీ.

news18-telugu
Updated: November 16, 2019, 9:31 PM IST
Railway Jobs: సదరన్ రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Railway Jobs: సదరన్ రైల్వేలో ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వేలో ఉద్యోగం మీ కలా? మీకు స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్ ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. సదరన్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2019-20 సంవత్సరానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో నియామక ప్రక్రియ చేపట్టింది. మొత్తం 12 పోస్టుల్ని ప్రకటించింది. లెవెల్ 1 లో 10 పోస్టులు, లెవెల్ 2 లో 2 పోస్టులున్నాయి. పూర్తి వివరాలను http://rrcmas.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 18 చివరి తేదీ. దక్షిణ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Southern Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 12

లెవెల్ 1 పోస్టులు- 10
లెవెల్ 2 పోస్టులు- 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 18 సాయంత్రం 5 గంటలు


విద్యార్హత- లెవెల్ 1 పోస్టుకు 10వ తరగతి లేదా ఐటీఐ పాస్ కావాలి. లెవెల్ 2 పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పాస్ కావాలి.స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్- ప్రెసిడెంట్ స్కౌట్ / గైడ్ / రోవర్ / రేంజర్ లేదా హిమాలయన్ వుడ్ బ్యాడ్జ్ ఉండాలి.
వయస్సు- లెవెల్ 1 పోస్టుకు 18 నుంచి 33 ఏళ్లు, లెవెల్ 2 పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు.
దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.250.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మోటో రేజర్ స్మార్ట్‌ఫోన్... ఎలా మడతపెట్టొచ్చో చూశారా?



ఇవి కూడా చదవండి:

ECIL Jobs: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు... నేరుగా ఇంటర్వ్యూ

HCL Jobs: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ట్రైనీ ఉద్యోగాలు... వివరాలివే

Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో 4103 జాబ్స్... దరఖాస్తు చేయండి ఇలా
First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు