SOUTH WESTERN RAILWAY RECRUITMENT NOTIFICATION RELEASED FOR 147 VACANCIES HERE FULL DETAILS NS
Railway Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో రైల్వేలో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
సౌత్ వెస్ట్రన్ రైల్వే (South Western Railway) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు సౌత్ వెస్ట్రన్ రైల్వే (South Western Railway) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 147 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
ఖాళీలు విద్యార్హతల వివరాలు: గూడ్స్ ట్రైన్ మేనేజర్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. మొత్తం 147 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ 147 ఖాళీల్లో 84 అన్ రిజర్వ్డ్ కాగా, ఎస్సీలకు 21, ఎస్టీలకు 10, ఓబీసీలకు 32 కేటాయించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్మతలను కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు 42, ఓబీసీ అభ్యర్థులకు 45, ఎస్టీ, ఎస్సీలకు 47 ఏళ్లను వయో పరిమితిగా నిర్ణయించారు. అప్లికేషన్ ఫీజు: ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. ISRO Recruitment: ఇస్రోలో ఉద్యోగ అవకాశాలు.. అర్హతలు అప్లికేషన్ విధానం..
ఎలా అప్లై చేయాలి.. Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ https://www.rrchubli.in/ ను ఓపెన్ చేయాలి. Step 2: అనంతరం నోటిఫికేషన్ లింక్ పక్కన Click here to submit online application ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 3: మొదటగా పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ నమోదు చేయాలి. అనంతరం Start Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 4: సూచించిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.