హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: భారతీయ రైల్వేలో 904 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: భారతీయ రైల్వేలో 904 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: భారతీయ రైల్వేలో 904 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: భారతీయ రైల్వేలో 904 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

South Western Railway Recruitment 2021 | సౌత్ వెస్టర్న్ రైల్వే 904 అప్రెంటీస్ పోస్టుల (Apprentice Jobs) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెండు జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి అలర్ట్. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 904 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. కర్నాటక, గోవాతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తమిళనాడులోని ధర్మపురి, సేలం, వేలూర్, మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేయచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

  IBPS Clerk Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

  South Western Railway Recruitment 2021: డివిజన్ల వారీగా ఖాళీల వివరాలు ఇవే


  మొత్తం ఖాళీలు904
  హుబ్లీ డివిజన్237
  క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ217
  బెంగళూరు డివిజన్230
   మైసూరు డివిజన్ 177
   సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు 43


  SBI PO Recruitment 2021: డిగ్రీ పాస్ అయినవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,065 ఉద్యోగాలు... ఎలా ఎంపిక చేస్తారంటే

  South Western Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే


   మొత్తం ఖాళీలు 904 విద్యార్హతలు
   ఫిట్టర్ 390 ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   వెల్డర్ 55 వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   మెషినిస్ట్ 13 మెషినిస్ట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   టర్నర్ 13 టర్నర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   ఎలక్ట్రీషియన్ 248 ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   కార్పెంటర్ 11 కార్పెంటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   పెయింటర్ 18 పెయింటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్ 16 రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ 138 ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
   స్టెనోగ్రాఫర్ 2 స్టెనోగ్రాఫర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.


  Indian Navy Recruitment 2021: ఇంటర్ పాస్ అయినవారికి అలర్ట్... ఇండియన్ నేవీలో బీటెక్ చేయండిలా

  South Western Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 3

  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

  వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.

  దరఖాస్తు ఫీజు- రూ.100

  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  APPSC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 151 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్

  South Western Railway Recruitment 2021: అప్లై చేయండి ఇలా...


  Step 1- అభ్యర్థులు ముందుగా https://jobs.rrchubli.in/ActApprentice2021-22/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- హోమ్ పేజీలో New Registration పైన క్లిక్ చేయాలి.

  Step 3- బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 4- ఫోటో, సంతకంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

  Step 5- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

  Step 6- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railways

  ఉత్తమ కథలు