హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: నైరుతి రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: నైరుతి రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: నైరుతి రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: నైరుతి రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

South Western Railway Recruitment 2020 | రైల్వేలో ఉద్యోగం మీ కలా? అందుకు తగ్గ అర్హతలు ఉన్నాయా? రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది.

రైల్వేలో ఉద్యోగం నిరుద్యోగుల కల. రైల్వేలో ఉద్యోగాలకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB మాత్రమే కాదు రైల్వే జోన్లకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి.  నైరుతి రైల్వే గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. కాబట్టి ఆయా క్రీడల్లో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 28న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 28 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrchubli.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ ఇదే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేసి, చివరి తేదీ లోగా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.

DRDO: బీటెక్ పాసైనవారికి రూ.31,000 వేతనంతో డీఆర్‌డీఓలో జాబ్స్

Indian Air Force Jobs: ఇంటర్ అర్హతతో జాబ్స్... దరఖాస్తు గడువు పెంచిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌

South Western Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 21

అథ్లెటిక్స్- 5

బ్యాడ్మింటన్- 2

క్రికెట్- 3

వెయిట్‌లిఫ్టింగ్- 2

టేబుల్ టెన్నిస్- 1

హాకీ- 4

స్విమ్మింగ్- 2

గోల్ఫ్- 2

Coast Guard Jobs 2020: టెన్త్ అర్హతతో కోస్ట్ గార్డ్‌లో జాబ్స్... నేటి నుంచి దరఖాస్తులు

DRDO Jobs 2020: ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైనవారికి డీఆర్‌డీఓలో ఉద్యోగాలు

South Western Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 28

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 28

వయస్సు- 18 నుంచి 25 ఏళ్లు

విద్యార్హతలు- ఇంటర్ పాస్ కావడంతో పాటు సంబంధిత క్రీడల్లో రాణించాలి.

దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Assistant Personnel Officer,

Head Quarter,

Railway Recruitment Cell,

2nd Floor,

Old GMs Office Building,

Club Road,

Hubballi-580023

First published:

Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways

ఉత్తమ కథలు