Railway Jobs: 386 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నైరుతి రైల్వే... నవంబర్ 20 చివరి తేదీ

South Western Railway Recruitment 2019 | ఆసక్తి గల అభ్యర్థులు http://www.rrchubli.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది నైరుతి రైల్వే.

news18-telugu
Updated: November 18, 2019, 1:19 PM IST
Railway Jobs: 386 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నైరుతి రైల్వే... నవంబర్ 20 చివరి తేదీ
Railway Jobs: 386 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న నైరుతి రైల్వే... నవంబర్ 20 చివరి తేదీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వేలో ఉద్యోగాల నియామకాలు కొనసాగుతున్నాయి. కొత్తవారికే కాదు... ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారికి కూడా మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది భారతీయ రైల్వే. సౌత్ వెస్టర్న్ (నైరుతి) రైల్వే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ లాంటి పోస్టుల భర్తీ చేస్తోంది. మొత్తం 386 ఖాళీలను ప్రకటించింది. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామ్-GDCE ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులివి. అంటే ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్న వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 20 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు http://www.rrchubli.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది నైరుతి రైల్వే. ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

South Western Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 386

సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 160
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 226
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 17


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 20విద్యార్హత- సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు 50 శాతం మార్కులతో 12వ తరగతి పాస్ కావాలి.
వయస్సు- జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 42 ఏళ్లు, ఓబీసీలకు 45 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 47 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు



ఇవి కూడా చదవండి:

BARC Recruitment 2019: విశాఖపట్నం, ముంబైలోని బార్క్‌ కేంద్రాల్లో ఉద్యోగాలు

CBSE Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... సీబీఎస్ఈలో 357 ఉద్యోగాలు

Indian Navy Jobs: ఇండియన్ నేవీలో 400 సెయిలర్ ఉద్యోగాలు... టెన్త్ పాసైతే చాలు
First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు