బ్యాంకింగ్ రంగంలో జాబ్ (Bank Jobs) చేస్తున్నవారికి గుడ్ న్యూస్. సౌత్ ఇండియన్ బ్యాంక్ (South Indian Bank) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 8 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఇతర పద్ధతుల్లో వచ్చే అప్లికేషన్స్ స్వీకరించరు. డిగ్రీ పాస్ కావడంతో పాటు బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
Jobs in Network18: మీడియాలో జాబ్ మీ కలా? నెట్వర్క్18 లో ఫ్రెషర్ ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
భర్తీ చేసే పోస్టులు- ప్రొబెషనరీ ఆఫీసర్ స్కేల్ 1
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 8
విద్యార్హతలు- రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కోర్సు 50 శాతం మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 2021 జూలై 31 నాటికి 28 ఏళ్ల లోపు
Be a part of the team that people bank on. Apply by visiting the link https://t.co/8x5Z8Ysnbg pic.twitter.com/UAoQTyY8sL
— South Indian Bank (@OfficialSIBLtd) September 1, 2021
అనుభవం- షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, అర్హన్ కో-ఆపరేటీవ్ బ్యాంక్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బ్యాంకింగ్ సబ్సిడరీలో రెండేళ్లు ఆఫీసర్ కేడర్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. బ్రాంచ్ ఆపరేషన్స్, లయబిలిటీ సేల్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కలెక్షన్ అండ్ రికవరీ, క్రెడిట్ రీటైల్ అండ్ ఎంఎస్ఎంఈ అండర్‌రైటింగ్, ఎంఎస్ఎంఈ రిలేషన్‌షిప్, సేల్స్ మేనేజర్, గోల్డ్ లోన్ బిజినెస్, క్రెడిట్ మిడ్ ఆఫీస్ ఫంక్షన్స్ విభాగాల్లో పనిచేసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.800.
ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వూ
వేతనం- రూ.36,000 బేసిక్ వేతనంతో రూ.63,840 వరకు వేతనం లభిస్తుంది.
పోస్టింగ్- దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వొచ్చు. మొదటి ఏడాది ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. రెండేళ్ల సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది.
Step 1- అభ్యర్థులు https://recruit.southindianbank.com/RDC/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Apply Here పైన క్లిక్ చేయాలి.
Step 3- పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 4- ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- ఫోటో, సంతకం, కరిక్యులమ్ విటే, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాలి.
Step 6- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
Step 7- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS