హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Recruitment 2021: రైల్వేస్‌లో 1785 పోస్టులు... పరీక్షలు లేకుండానే భర్తీ

Railway Recruitment 2021: రైల్వేస్‌లో 1785 పోస్టులు... పరీక్షలు లేకుండానే భర్తీ

ప్రస్తుతం 302 రైళ్లలో ఈ డివైజ్‌లను అమర్చారు. ప్రతి రైలులో రెండు డివైజ్‌లు ఉంటాయి కాబట్టి మొదటిది విఫలమైతే లోకో-పైలట్ కు రెండోది బ్యాకప్ గా ఉంటుంది. పొగ వల్ల ఏర్పడే జాప్యాన్ని తగ్గించేందుకు వాకీ-టాకీ మాదిరిగానే ఉండే ఫాగ్ సేఫ్టీ డివైజ్‌ను కూడా లోకో పైలట్‌లు ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం 302 రైళ్లలో ఈ డివైజ్‌లను అమర్చారు. ప్రతి రైలులో రెండు డివైజ్‌లు ఉంటాయి కాబట్టి మొదటిది విఫలమైతే లోకో-పైలట్ కు రెండోది బ్యాకప్ గా ఉంటుంది. పొగ వల్ల ఏర్పడే జాప్యాన్ని తగ్గించేందుకు వాకీ-టాకీ మాదిరిగానే ఉండే ఫాగ్ సేఫ్టీ డివైజ్‌ను కూడా లోకో పైలట్‌లు ఉపయోగిస్తున్నారు.

Railway Recruitment 2021 | రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే1785 అప్రెంటీస్ పోస్టుల్ని (Apprentice Posts) భర్తీ చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

భారతీయ రైల్వే అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి సిద్దమైంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే (South Eastern Railways) విభాగం మొత్తం 1785 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు scr.indianrailways.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ నవంబరు 15న ప్రారంభమైంది. దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 14, సాయంత్రం 5 గంటలు. ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్, ఏసీ మెషినిస్ట్, కేబుల్ జాయింటర్, క్రేన్ ఆపరేటర్, వైండర్ పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి.

అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అర్హతలు


విద్యార్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అప్రెంటిస్‌షిప్ చేయాలనుకుంటున్న ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి.

వయసు: అభ్యర్థుల వయసు జనవరి 1, 2022 నాటికి తప్పనిసరిగా 15- 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీ లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. శారీరక వికలాంగులకు పదేళ్లు, మాజీ సైనికులకు వారు అందించిన సేవల మేరకు గరిష్ఠ పరిమితిలో అదనంగా పదేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

BOB Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?


Step 1. సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ scr.indianrailways.gov.in కు వెళ్లండి

Step 2. హోమ్ పేజీలో అప్రెంటిస్‌షిప్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

Step 3. ఓపెన్ అయ్యే వెబ్ పేజీలో పేరు, ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వంటి అన్ని వివరాలు నమోదు చేసి, దరఖాస్తును పూరించండి

Step 4. అవసరమైన పత్రాలను ఫోటోగ్రాఫ్, స్కాన్ చేసి నిర్దేశించిన సైజ్‌లో అప్‌లోడ్ చేయండి

Step 5. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి

Step 6. రిజిస్టర్ చేసిన ఫారంను డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రింట్ తీసుకోండి.

Telangana Jobs: రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

ఫీజు వివరాలు


జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజు ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి.

ఎంపిక విధానం


అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత ప్రమాణాలు, సంబంధిత కమ్యూనిటీల్లో అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా దరఖాస్తుదారులను తీసుకుంటారు. ఒకే కమ్యూనిటీలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు ఉంటే ఎక్కువ వయసు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఖాళీల కంటే 1.5 రెట్లు ఎక్కువగా అభ్యర్థులను వెరిఫికేషన్‌కు పిలుస్తారు. మెడికల్, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షల్లో కూడా అభ్యర్థులు ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railway jobs, Railways

ఉత్తమ కథలు