Railway Jobs: రైల్వేలో 617 టికెట్ క్లర్క్, లోకో పైలట్, జేఈ జాబ్స్.. ఖాళీల వివరాలివే

South Eastern Railway Recruitment 2020 | భారతీయ రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: June 2, 2020, 5:23 PM IST
Railway Jobs: రైల్వేలో 617 టికెట్ క్లర్క్, లోకో పైలట్, జేఈ జాబ్స్.. ఖాళీల వివరాలివే
Railway Jobs: రైల్వేలో 617 టికెట్ క్లర్క్, లోకో పైలట్, జేఈ జాబ్స్.. ఖాళీల వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీ హడావుడి మళ్లీ మొదలైంది. కరోనా వైరస్ లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో ఖాళీలను భర్తీ చేస్తోంది రైల్వే. అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జేఈ లాంటి పోస్టుల భర్తీకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 617 ఖాళీలను ప్రకటించింది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్‌కు గతంలోనే దరఖాస్తుల్ని స్వీకరించింది. ఏప్రిల్ 23న దరఖాస్తు గడువు ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నియామక ప్రక్రియ వాయిదా పడింది. దీంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసింది సౌత్ ఈస్టర్న్ రైల్వే. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి జూన్ 23 చివరి తేదీ. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అంటే ఈ పోస్టులకు ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.rrcser.co.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

South Eastern Railway Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...



అసిస్టెంట్ లోకోపైలట్- 324
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 63
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 68
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 84
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 70జేఈ (P.Way): 3
జేఈ (Works): 2
జేఈ (Signal): 1
జేఈ (Tele): 1

South Eastern Railway Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 23
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SSC Jobs: గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడంటే

Jobs: కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో 2167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: June 2, 2020, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading