Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Railway Jobs: రైల్వేలో జాబ్స్‌కి మరో నోటిఫికేషన్... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

    South East Central Railway Recruitment 2019 | దరఖాస్తుకు 2020 జనవరి 13 చివరి తేదీ. www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌సీ బిలాస్‌పూర్ స్పోర్ట్స్ కోటా లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

    news18-telugu
    Updated: January 12, 2020, 11:37 AM IST
    Railway Jobs: రైల్వేలో జాబ్స్‌కి మరో నోటిఫికేషన్... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
    Railway Jobs: రైల్వేలో జాబ్స్‌కి మరో నోటిఫికేషన్... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)
    • Share this:
    రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి కోసం వరుసగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. భారతీయ రైల్వేలో వేర్వేరు విభాగాల్లో, వేర్వేరు కోటాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటాలో పలు పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆగ్నేయ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవారి నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 జనవరి 13 చివరి తేదీ. www.secr.indianrailways.gov.in వెబ్‌సైట్‌లో ఆర్ఆర్‌సీ బిలాస్‌పూర్ స్పోర్ట్స్ కోటా లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేయాలి.

    Railway Recruitment 2019: ఖాళీల వివరాలివే



    మొత్తం ఖాళీలు- 26
    అథ్లెటిక్స్ (పురుషులు)- 1
    అథ్లెటిక్స్ (మహిళలు)- 1
    బ్యాడ్మింటన్ (పురుషులు)- 2
    బ్యాడ్మింటన్ (మహిళలు)- 2

    బాస్కెట్ బాల్ (పురుషులు)- 2
    బాస్కెట్ బాల్ (మహిళలు)- 2
    బాక్సింగ్ (మహిళలు)- 3
    క్రికెట్ (పురుషులు)- 4
    హ్యాండ్‌బాల్ (మహిళలు)- 3
    హాకీ (పురుషులు)- 3
    కబడ్డీ (పురుషులు)- 1
    ఖో ఖో (పురుషులు)- 1
    వాలీబాల్ (పురుషులు)- 1

    Railway Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 14
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 13
    విద్యార్హత- నాన్ టెక్నికల్ పోస్టుకు 12వ తరగతి, టెక్నికల్ పోస్టుకు 10వ తరగతితో పాటు ఐటీఐ.
    వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Inter Jobs: ఇంటర్ పాసైతే ఈ 7 జాబ్ నోటిఫికేషన్లు మీ కోసమే

    Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 సచివాలయ ఉద్యోగాలు... జిల్లాల వారీగా పోస్టుల వివరాలివే

    SBI Clerk Jobs: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్... ఎగ్జామ్ సిలబస్ ఇదే

    EPFO Jobs: డిగ్రీ పాసైనవారికి ఈపీఎఫ్ఓలో 421 ఉద్యోగాలు... యూపీఎస్‌సీ నోటిఫికేషన్
    Published by: Santhosh Kumar S
    First published: January 12, 2020, 11:35 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading