హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Recruitment 2022: రైల్వేలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో జాబ్స్.. కేవలం ఇంటర్వూ ద్వారానే ఎంపిక.. రూ. 44 వేల వేతనం

Railway Recruitment 2022: రైల్వేలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో జాబ్స్.. కేవలం ఇంటర్వూ ద్వారానే ఎంపిక.. రూ. 44 వేల వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ (Railway Jobs) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సూచించిన తేదీల్లో ఇంటర్వ్యూలకు (Job Interviews) హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యువత అత్యధికంగా ఆసక్తి చూపే ఉద్యోగాల్లో రైల్వే జాబ్స్ (Railway Jobs) ఒకటి. ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా జబ్ సెక్యూరిటీ ఉండడమే ఇందుకు కారణం. ఇటీవల రైల్వే ఉద్యోగాల భర్తీకి జోన్ల వారీగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా (Corona) నేపథ్యంలో వైద్య విభాగంలో ఖాళీలను అత్యధికంగా భర్తీ చేస్తోంది రైల్వే. ఈ మేరకు వరుసగా నోటిఫికేషన్లను జోన్ల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (South East Railway) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పారా మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సెంట్రల్ హాస్పిటల్, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, బిలాస్పూర్ లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

HPCL Recruitment 2022: విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

విభాగాల వారీగా ఖాళీల వివరాలు..


పోస్టుఖాళీలు
స్టాఫ్ నర్స్49
ఫార్మసిస్ట్4
డ్రెస్సర్ (Dresser)6
ఎక్స్ రే టెక్నీషియన్3
డెంటల్ హైజనిస్ట్1
లాబ్ సూరింటెండెంట్2
ల్యాబ్ అసిస్టెంట్7
ఫిజియోథెరపిస్ట్1
రిఫ్రాక్షనిస్ట్ (Refractionist)1
ఆడియో కమ్ స్పీచ్ థెరపిస్ట్1
మొత్తం:75


విద్యార్హతల వివరాలు:

స్టాఫ్ నర్స్: బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ఫార్మసిస్ట్: ఫార్మసీలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

డ్రెస్సర్: టెన్త్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ఎక్స్ రే టెక్నీషియన్: సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

UOH Recruitment 2022: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాళీలు... పరీక్ష లేకుండా ఉద్యోగం

డెంటల్ హైజనిస్ట్: డెంటల్ హైజీన్ విభాగంలో డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ల్యాబ్ సూపరింటెండెంట్: బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ, లైఫ్ సైన్స్ లో బీఎస్సీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

-అభ్యర్థులు ఇతర పూర్తి విద్యార్హతల వివరాలను, అనుభవానికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

UPSC Recruitment 2022: గవర్నమెంట్ జాబ్ అలర్ట్... 187 ఉద్యోగాల దరఖాస్తుకు 2 రోజులే గడువు

వేతనాల వివరాలు:

ఈ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ.19,900 నుంచి రూ.44,900 వరకు వేతనం చెల్లించనున్నారు.

ఎంపిక ప్రక్రియ: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ కింది తెలిపిన తేదీల్లో office of the Medical Director, Central Hospital, SEC Railway, Bilaspur చిరునామాల్లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

స్టాఫ్ నర్స్: జనవరి 18, 19, 20, 21.

ఫార్మసిస్ట్, ఎక్స్ రే, టెక్నీషియన్ అండ్ డ్రెస్సర్: జనవరి 22.

ల్యాబ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, డెంటల్ హైజనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆడియో కమ్ స్పీచ్ థెరపిస్ట్, రిఫ్రాక్షనిస్ట్: జనవరి 24, 25.

ఇతర వివరాలు: అభ్యర్థులు ముందుగా బయో డేటా ఫామ్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్ ను పూర్తిగా నింపి ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో వెంట తీసుకురావాలి. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.

First published:

Tags: Central Government Jobs, Job notification, JOBS, Railway jobs

ఉత్తమ కథలు