హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Recruitment 2022: టెన్త్ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4 వేల జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. వివరాలివే

Railway Recruitment 2022: టెన్త్ అర్హతతో దక్షిణ మధ్య రైల్వేలో 4 వేల జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ మధ్య రైల్వే నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారీగా ఖాళీలను (Railway Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 30న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోడానికి జనవరి 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

ఖాళీల వివరాలు:

S.No.పోస్టుఖాళీలు
1.AC మెకానిక్250
2.కార్పెంటర్18
3.డీజిల్ మెకానిక్531
4.ఎలక్ట్రీషియన్1019
5.ఎలక్ట్రానిక్ మెకానిక్92
6.ఫిట్టర్1460
7.మెషినిస్ట్71
8.మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్5
9.మిల్ రైట్ మెయింటెనెన్స్24
10.పెయింటర్80
12.వెల్డర్553
మొత్తం: 4103

అర్హత:

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు 50 శాతం మార్కులతో టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి. ఇంకా NCVT/SCVT నుంచి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.

NIT Recruitment 2022: వరంగల్ NITలో 100 ఫ్యాకల్టీ జాబ్స్ .. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. పూర్తి వివరాలివే

వయోపరిమితి:

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 30, 2022 నాటికి కనిష్టంగా 15 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి.

వయోపరిమితి సడలింపు:

OBC(NCL) అభ్యర్థులు- 3 సంవత్సరాల

SC/ST అభ్యర్థులు- 5 సంవత్సరాల

PWD అభ్యర్థులు- 10 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము:

SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు.

మిగతా అభ్యర్థులకు-రూ.100

చెల్లింపు విధానం - ఆన్‌లైన్

జీతం:

అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.

ఉద్యోగ స్థలం:

ఈ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు , కర్ణాటక , తెలంగాణలో పోస్టింగ్ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

- మెరిట్ లిస్ట్

- మెడికల్ ఎగ్జామినేషన్

- ఫిజికల్ క్వాలిఫికేషన్

అప్లికేషన్ డైరెక్ట్ లింక్: LINK

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: 30/12/2022

దరఖాస్తుకు ఆఖరి తేదీ: 29/01/2023

First published:

Tags: JOBS, Railway jobs

ఉత్తమ కథలు