Railway Jobs 2021: దక్షిణ మధ్య రైల్వేలో 4,103 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

Railway Jobs 2021: దక్షిణ మధ్య రైల్వేలో 4,103 ఉద్యోగాలు... దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్ (ప్రతీకాత్మక చిత్రం)

South Central Railway Recruitment 2021 | దక్షిణ మధ్య రైల్వే 4,000 పైగా ఉద్యోగాల (Railway Jobs) భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    భారతీయ రైల్వేలో ఉద్యోగాలు (Railway Jobs) కోరుకునేవారికి శుభవార్త. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4,103 పోస్టుల్ని ప్రకటించింది. కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టులున్నాయి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 3 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు జాబ్ నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    South Central Railway Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

































































     మొత్తం ఖాళీలు  4,103  విద్యార్హతలు
     ఏసీ మెకానిక్  250  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మెకానిక్ (R & AC) ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     కార్పెంటర్  18  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు కార్పెంటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     డీజిల్ మెకానిక్  531  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     ఎలక్ట్రీషియన్  1,019  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     ఎలక్ట్రానిక్ మెకానిక్ 92  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     ఫిట్టర్  1,460  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     మెషినిస్ట్ 71  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మెషినిస్ట్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్  5  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     మిల్‌రైట్ మెయింటనెన్స్  24  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు మిల్‌రైట్ మెయింటనెన్స్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     పెయింటర్  80  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు పెయింటర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
     వెల్డర్  553  టెన్త్ 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

    SBI PO Recruitment 2021: డిగ్రీ పాస్ అయినవారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,065 ఉద్యోగాలు... ఎలా ఎంపిక చేస్తారంటే

    South Central Railway Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 అక్టోబర్ 4

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 3

    వయస్సు- 2021 అక్టోబర్ 4 నాటికి 15 నంచి 24 ఏళ్లు

    దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు లేదు.

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Indian Navy Recruitment 2021: ఇంటర్ పాస్ అయినవారికి అలర్ట్... ఇండియన్ నేవీలో బీటెక్ చేయండిలా

    South Central Railway Recruitment 2021: అప్లై చేయండి ఇలా...


    Step 1- అభ్యర్థులు https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 2- హోమ్ పేజీలో Online Act Apprentice Application లింక్ పైన క్లిక్ చేయాలి.

    Step 3- ఇన్‌స్ట్రక్షన్స్ పూర్తిగా చదవాలి.

    Step 4- New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 5- ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.

    Step 6- లాగిన్ అయిన తర్వాత విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.

    Step 7- ఫోటో, సంతకం, విద్యార్హతల సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.

    Step 8- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.

    Step 9- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: