హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs 2021: సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతిలో రైల్వే జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

South Central Railway Recruitment 2021 | సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాలను (Railway Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 4,103 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో తెలుసుకోండి.

  భారతీయ రైల్వేలో ఉద్యోగం (Railway Jobs) మీ కలా? అయితే అలర్ట్. దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 4,103 ఖాళీలను భర్తీ చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లలో ఈ అప్రెంటీస్ పోస్టులున్నాయి. సికింద్రాబాద్, కాజిపేట్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో ఉన్న రైల్వే యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే.

  దక్షిణ మధ్య రైల్వే మొత్తం 4,103 పోస్టుల భర్తీకి ప్రస్తుతం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 3 లాస్ట్ డేట్. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ అప్రెంటీస్ పోస్టులకు దక్షిణ మధ్య రైల్వే ఎలా ఎంపిక చేస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

  SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

  విద్యార్హతలివే...


  దక్షిణ మధ్య రైల్వే భర్తీ చేస్తున్న 4,103 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. 10+2 విధానంలో చదివి ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పాస్ కావాలి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేయకూడదు. అభ్యర్థుల వయస్సు 2021 అక్టోబర్ 4 నాటికి 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

  APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

  ఎంపిక విధానం ఇదే...


  మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. అభ్యర్థులు 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్‌లో, ఐటీఐ ఎగ్జామ్‌లో సాధించిన మార్కులకు సమాన వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే ఎక్కువ వయస్సు ఉన్నవారిని పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే 10వ తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఎవరు ముందు పాస్ అయ్యారన్న అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తారు.

  ఎంపికైన వారికి ఒక ఏడాది అప్రెంటీస్ ఉంటుంది. సెంట్రల్ అప్రెంటీస్‌షిప్ కౌన్సిల్ సిలబస్ ప్రకారం శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌షిప్ రూల్స్ ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railways, Rajahmundry, Tirupati, Vijayawada

  ఉత్తమ కథలు