SOUTH CENTRAL RAILWAY ORGANIZING OUTREACH CAMPS FOR ADDRESSING THE GRIEVANCES OF CANDIDATES APPEARED FOR RRB EXAM NS
RRB NTPC అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాలపై అభ్యంతరాల స్వీకరణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక క్యాంపులు..
ప్రతీకాత్మక చిత్రం
RRB NTPC Results: దక్షిణ మధ్య రైల్వే (SCR) ఎన్టీపీసీ అభ్యర్థులు ప్రకటన చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ శిబిరాలను జనవరి 1 నుంచి ఫిబ్రవరి 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఫలితాలపై దేశ వ్యాప్తంగా అభ్యర్థుల నుంచి తీవ్ర ఆందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేసిన విధానం సరిగా లేదంటూ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల అభ్యర్థుల ఆందోళనలు ఉద్రిక్తతలకు సైతం దారితీశాయి. దీంతో స్పందించిన ఇండియన్ రైల్వే హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది. మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉన్న సందేహాలు, అనుమానాలు తీర్చడమే లక్ష్యంగా ఈ హైపవర్ కమిటీ పనిచేయనుంది. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కు అభ్యర్థులను ఎంపిక చేయడానికి పాటించిన పద్ధతిని ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ ఫలితాలపై సందేహాలు ఉన్న అభ్యర్థులు తమ ఫిర్యాదును రిజిస్టర్ చేయొచ్చు. rrbcommittee@railnet.gov.in మెయిల్ ఐడీకి తమ కంప్లైంట్స్ పంపొచ్చు.
అయితే.. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ శిబిరాలను జనవరి 1 నుంచి ఫిబ్రవరి 16 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను హైవపర్ కమిటీకి ఫార్వర్డ్ చేయనున్నారు. ఎన్టీపీసీ ఎగ్జామ్ కు హాజరైన అభ్యర్థులు ఈ శిబిరాలను సందర్శించి వారి సందేహాలను వ్యక్తం చేయవచ్చు. ఇందుకు దరఖాస్తు నమూనాను సైతం సౌత్ సెట్రల్ రైల్వే విడుదల చేసింది. దరఖాస్తులో వారి సందేహాలను, వాటిని ధ్రువీకరించే పత్రాలను, మొబైల్ నంబర్, ఈమెయిల్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. RRB NTPC Alert: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అభ్యర్థులకు అలర్ట్... ఫలితాలపై ఫిర్యాదులు సబ్మిట్ చేసే అవకాశం
ఈ శిబిరాలను సికింద్రాబాద్, గుంతకల్, గుంటూరు, నాందేడ్, విజయవాడలో నిర్వహించనున్నారు. ఆ వివరాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది రైల్వే. ఈ ఫిర్యాదుల్ని కమిటీ పరిశీలించిన తర్వాత 2022 మార్చి 4 లోగా తమ సిఫార్సుల్ని సమర్పిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిశీలించేందుకు హై పవర్ కమిటీ ఏర్పాటు చేయడంతో 2022 ఫిబ్రవరి 15 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 2022 ఫిబ్రవరి 23 నుంచి జరగాల్సిన కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ 1 వాయిదా వేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.