Jobs: ఈ 5 జాబ్ నోటిఫికేషన్లకు రేపే లాస్ట్ డేట్... పూర్తి వివరాలు తెలుసుకోండి

Jobs | ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ చదివి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. 

news18-telugu
Updated: August 25, 2019, 10:07 AM IST
Jobs: ఈ 5 జాబ్ నోటిఫికేషన్లకు రేపే లాస్ట్ డేట్... పూర్తి వివరాలు తెలుసుకోండి
Jobs: ఈ 5 జాబ్ నోటిఫికేషన్లకు రేపే లాస్ట్ డేట్... పూర్తి వివరాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 25, 2019, 10:07 AM IST
మీరు ఏదైనా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అందుకు తగ్గ అర్హతలు మీకు ఉన్నాయా? ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. అందుకు తగ్గ అర్హతలు మీకు ఉంటే దరఖాస్తు చేయొచ్చు. ఇటీవల రిలీజైన ఐదు జాబ్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 26 చివరి తేదీ. మరి మీకున్న అర్హతల్ని బట్టి తగిన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవడానికి ఇదే సరైన అవకాశం. సౌత్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో 21 ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ https://scr.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్-NTPC సంస్థ థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ కోసం 203 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో అర్హత, అనుభవం గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్ట్ 26 లోగా www.ntpccareers.net వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. పరీక్ష, అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లాంటి వివరాలు వెల్లడించాల్సి ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్- LIC HFL అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. మొత్తం 300 ఖాళీలున్నాయి. పోస్టులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, చండీగఢ్, కర్నాటక, కేరళ, పుదుచ్చెరీ, తమిళనాడు, గోవా, గుజరాత్, మహారాష్ట్రలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. దరఖాస్తుకు ఆగస్ట్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. డిప్లొమా పూర్తి చేసినవారు 2019 ఆగస్ట్ 26, 27 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మొత్తం 28 పోస్టులున్నాయి. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశముంది. ఎంపికైన వారు న్యూ ఢిల్లీలో సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్స్ డివిజన్‌లో పనిచేయాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ పోస్టుకు ఆగస్ట్ 26న, ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ పోస్టుకు ఆగస్ట్ 27న ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్-AIESL స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్, ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 355 ఉద్యోగాలున్నాయి. హైదరాబాద్‌లో 72, ముంబైలో 185, ఢిల్లీలో 34, కోల్‌కతాలో 64 ఖాళీలున్నాయి. ఇవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు. వేర్వేరు తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఎయిర్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ చదివి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IAF Jobs: యువకులకు గుడ్ న్యూస్... ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్‌లో ఉద్యోగాలు

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Naval Dockyard Jobs: నావల్ డాక్‌యార్డ్‌లో 1233 అప్రెంటీస్ పోస్టులు

 
First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...