దక్షిణ మధ్య రైల్వే వేర్వేరు విభాగాల్లో 4103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 8 చివరి తేదీ. అయితే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యర్థుల్లో పలు సందేహాలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం గురించి డౌట్స్ ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే భర్తీ చేస్తున్న అప్రెంటీస్ పోస్టులు ఇవి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి అప్రెంటీస్ పోస్టుల్ని సౌత్ సెంట్రల్ రైల్వే భర్తీ చేయనుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని లాలాగూడ, మెట్టుగూడ, కాజిపేట్, సికింద్రాబాద్, మౌలాలి, కాచిగూడ, గుంటుపల్లి, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, గుంతకల్, గుత్తి, తిరుపతి, నాందేడ్, పూర్ణ ప్రాంతాల్లోని యూనిట్లలో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
https://scr.indianrailways.gov.in/ వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దరఖాస్తు చేయడానికీ ఇదే వెబ్సైట్ ఫాలో కావాలి.
రిజిస్ట్రేషన్ చేయడానికి మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఉండాలి. ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా ఓటీపీ వస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభించడానికి ముందు మీ దగ్గర ఎస్ఎస్సీ / టెన్త్ మార్క్స్ షీట్, ఐటీఐ మెమో, కుల ధృవీకరణ పత్రం, వికలాంగుల సర్టిఫికెట్, ఎక్స్-సర్వీస్‌మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికెట్, జవాన్లుగా పనిచేస్తున్నట్టైతే సర్వీస్ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి.
50% మార్కులతో 10వ తరగతి, ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు సమయంలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ పురుష అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్‌తో పాటు ఇమెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది.
ఒకసారి దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి, మార్పుచేర్పులు చేయడానికి సాధ్యం కాదు. అందుకే దరఖాస్తు సమయంలోనే వివరాలన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
మొత్తం 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు
ఇవి కూడా చదవండి:
Jobs: ఇంటర్ పాసైన అమ్మాయిలకు గుడ్ న్యూస్... ఇండియన్ ఆర్మీలో చేరే అవకాశం
CISF Jobs: గుడ్ న్యూస్... 1,314 ఏఎస్సై ఉద్యోగాలకు సీఐఎస్ఎఫ్ నోటిఫికేషన్... వివరాలివే
ISRO Jobs: నెల్లూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Railway Apprenticeship, Railways, South Central Railways