హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Railway Jobs: రైల్వే ఉద్యోగాలపై గందరగోళం... మళ్లీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్

Railway Jobs: రైల్వే ఉద్యోగాలపై గందరగోళం... మళ్లీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్

Railway Jobs: రైల్వే ఉద్యోగాలపై గందరగోళం... మళ్లీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్
(ప్రతీకాత్మక చిత్రం)

Railway Jobs: రైల్వే ఉద్యోగాలపై గందరగోళం... మళ్లీ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ (ప్రతీకాత్మక చిత్రం)

South Central Railway Apprentice Recruitment 2019 | అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి... స్థానికులకే అవకాశం కల్పిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లు రైల్వే వర్క్‌షాప్స్‌లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే కూడా 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఆ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో 24 యూనిట్లలో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. అయితే ఈ నోటిఫికేషన్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు. రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీలో తెలుగువారికి అన్యాయం జరుగుతోందన్నది వారి వాదన. సాధారణంగా ఏ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా, దేశంలోని అన్ని ప్రాంతాలవారు దరఖాస్తు చేయొచ్చు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన అప్రెంటీస్ నోటిఫికేషన్‌కు ఇదే వర్తిస్తుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. ఇదే స్థానిక అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది.

ఇటీవల చెన్నై కేంద్రంగా సదరన్ రైల్వే కూడా 3429 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ... ఈ నోటిఫికేషన్‌కు ఆ జోన్ పరిధిలోని అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలన్న నిబంధన విధించింది. అంటే... సదరన్ రైల్వే జోన్ అభ్యర్థులు తప్ప ఇతరులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అవకాశం లేకుండా పోయింది. సదరన్ రైల్వే మాత్రమే కాదు... ఇతర జోన్లు కూడా ఇవే నియమనిబంధనలతో నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. అదే సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన అప్రెంటీస్ నోటిఫికేషన్‌కు మాత్రం దేశంలోని ఏ ప్రాంతాల అభ్యర్థులైనా దరఖాస్తు చేయొచ్చు. దీని వల్ల తమకు అన్యాయం జరుగుతోందని స్థానిక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి... స్థానికులకే అవకాశం కల్పిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనపై కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ లేఖ కూడా రాశారు. అయినా కేంద్ర రైల్వే మంత్రి నుంచి స్పందన రాలేదు. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 8 వరకే అవకాశం ఉంది. మరి రైల్వే అంతలోపే నిర్ణయం తీసుకుంటుందా? నోటిఫికేషన్‌ను రద్దు చేస్తుందా? అన్నది వేచి చూడాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X2 Pro: తక్కువ ధరకే రానున్న రియల్‌మీ ఎక్స్‌2 ప్రో... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

LIC HFL Jobs: ఎల్ఐసీ హౌజింగ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

Govt Jobs: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ రిలీజ్

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

First published:

Tags: Andhra Pradesh, Andhrapradesh, AP News, CAREER, Exams, Indian Railway, Indian Railways, Job notification, JOBS, NOTIFICATION, Rail, Railway Apprenticeship, Railways, South Central Railways, Telangana, Telangana News

ఉత్తమ కథలు