NEET, JEE పరీక్షలపై కాంగ్రెస్ సీఎంలతో సోనియా కీలక సమావేశం

పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: August 26, 2020, 8:18 AM IST
NEET, JEE పరీక్షలపై కాంగ్రెస్ సీఎంలతో సోనియా కీలక సమావేశం
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)
  • Share this:
జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌లు వినిపిస్తున్నప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షల కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలతో నేడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో చర్చించనున్నారు. జేఈఈ, నీట్‌తో పాటు జీఎస్టీపైనా సమాలోచనలు చేయనున్నారు సోనియా గాంధీ. కాంగ్రెస్ సీఎంలతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

పరీక్షల నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంపుతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాలను 570 నుంచి 660కి, నీట్ కేంద్రాలను 2546 నుంచి 3843కి పెంచారు. షిఫ్ట్‌ల సంఖ్యను కూడా 8 నుంచి 12 పెంచి.. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే వారి సంఖ్యను తగ్గించారు. ఒక్కో షిఫ్ట్‌కు పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను 1.32 లక్షల నుంచి 85వేలకు తగ్గించారు. కాగా, దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు 8.58 లక్షల మంది విద్యార్థులు, నీట్‌కు 15.97 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: August 26, 2020, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading