Home /News /jobs /

SOME PRIVATE SCHOOLS IN TELANGANA CHARGING THIS VARIETY FEES FROM STUDENTS BA

ఫీజులందు ఈ ఫీజు వేరయా.. స్కూళ్లు ప్రారంభం అవడంతోనే ఇదెక్కడి వసూళ్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు తరగతి గదుల్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే, స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టారు.

    తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. 9, 10 తరగతుల విద్యార్థులకు తరగతి గదుల్లోనే పాఠాలు చెబుతున్నారు. అయితే, స్కూళ్లు ప్రారంభం కావడంతోనే ప్రైవేట్ స్కూళ్లలో కొత్త రకం ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టారు. కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి ఎలాంటి తరగతి గదుల శిక్షణ లేకుండా కేవలం ఆన్ లైన్ క్లాసులకే పరిమితం అయిన ప్రైవేట్ స్కూళ్లు ఇప్పుడు స్కూళ్లు ఓపెన్ చేసిన తర్వాత కొత్త రకం ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదేంటంటే, ‘కరోనా ఫీజు’. ఔను. మీరు చదివింది కరెక్టే. కరోనా ఫీజు అంటే.. స్కూలుకు హాజరయ్యే విద్యార్థులకు కరోనా వైరస్ రాకుండా పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు, స్ప్రే చేసేందుకు అయ్యే ఖర్చును కూడా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ స్కూళ్లు లేవు కాబట్టి, తమ వద్ద పనిచేసే ఆయాలు, పనివాళ్లను కూడా స్కూళ్లు తొలగించాయి. ఇప్పుడు మళ్లీ స్కూళ్లు తెరవడంతో స్కూళ్లు క్లీనింగ్ చేయడానికి, ఇతరత్రా పరిశుభ్రత గురించి శ్రద్ధ పెట్టడానికి మళ్లీ వారిని నియమించుకుంటున్నాయి యాజమాన్యాలు.

    కరోనా ఫీజును ఒక్కో స్కూలు ఒక్కో రకమైన ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొందరు నెలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.100 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తుండగా, కొన్ని కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఆ ఫీజులు మరింత ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి. కరోనా కారణంగా తాము ఎంతో నష్టపోయామని స్కూళ్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఫీజుల విషయంలో కొన్ని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మళ్లీ తమ మీద ఆర్థిక భారం పడకుండా, విద్యార్థుల నుంచే ఆ ఫీజును కూడా వసూలు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలు నిర్ణయించాయి.

    కరోనా వైరస్ నేపథ్యంలో స్కూళ్లు తెరిచే వారికి ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. ప్రతి బేంచ్ కు ఒక విద్యార్థిని మాత్రమే కూర్చోబెట్టాలని అధికారులు ఉపాధ్యాయులకు సూచించారు. తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రుల నుంచి అంగీకర పత్రాలను సైతం స్వీకరిస్తున్నారు. పాఠశాలల్లో హ్యాండ్ వాష్, శానిటైజర్లు, సబ్బులు, థర్మోమీటర్లను అందుబాటులో ఉంచుతున్నారు. విద్యార్థుల మధ్య ఆరు మీటర్ల దూరం ఉండేలా క్లాస్ రూముల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు విధిగా ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలన్న నిబంధనేమీ లేదని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే తరగతులకు అనుమతిస్తామన్నారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు ఇప్పటికే 60 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంగీకరించారని మంత్రి వివరించారు. విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్ చేయాలని, క్లాస్ రూంలను ప్రతీ రోజు శానిటైజ్‌ చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Schools reopening, Telangana

    తదుపరి వార్తలు