హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Sleeping Office Hours: ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుందా.. అయితే అక్కడ ఈ అవకాశం ఉంది..

Sleeping Office Hours: ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుందా.. అయితే అక్కడ ఈ అవకాశం ఉంది..

Sleeping Office Hours: ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుందా.. అయితే అక్కడ ఈ అవకాశం ఉంది..

Sleeping Office Hours: ఆఫీస్ లో మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర వస్తుందా.. అయితే అక్కడ ఈ అవకాశం ఉంది..

Sleeping Office Hours: ప్రస్తుతం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దీని ఉద్దేశ్యం ఏమిటంటే కంపెనీ ఉద్యోగుల శ్రమ నుండి ప్రయోజనం పొందటం. ఈ మధ్య కాలంలో ఉద్యోగులు ఆఫీసులో మధ్యాహ్నం కునుకు తీసేందుకు అనుమతించడం చర్చనీయాంశమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దీని ఉద్దేశ్యం ఏమిటంటే కంపెనీ ఉద్యోగుల శ్రమ నుండి ప్రయోజనం పొందటం. ఈ మధ్య కాలంలో ఉద్యోగులు ఆఫీసులో మధ్యాహ్నం కునుకు తీసేందుకు అనుమతించడం చర్చనీయాంశమైంది. ఆఫీసులో(Office) మధ్యాహ్న భోజనం తర్వాత ఉద్యోగులు(Employees) వచ్చి తమ సీట్లలో కూర్చున్నప్పుడు చాలా మందికి మత్తుగా ఉండటంతో.. నిద్రా ఆటోమేటిక్ గా(Automatic) వస్తుంటుంది. అయితే.. పని చేస్తున్నప్పుడు నిద్రపోవడం దాదాపు అసాధ్యం. మీరు నిద్రపోతున్నట్లు బాస్ చూస్తే.. అతను మిమ్మల్ని తిట్టడం ఖాయం లేదా తరచుగా అలాంటి నిర్లక్ష్యం వల్ల మీ ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే తాజా అధ్యయనంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి.


Degree-Btech Jobs: బీటెక్, డిగ్రీ అభ్యర్థులకు గుడ్ న్యూస్..CEPTAM-10 ద్వారా ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు ఇలా..


ఉద్యోగులను పనిలో నిద్రపోయేలా చేయడం వల్ల కంపెనీకి లాభం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు. చైనాలో.. మధ్యాహ్న భోజనం తర్వాత ఉద్యోగులు నిద్రపోవడం సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. ఉద్యోగులు కష్టపడి పని చేయడంతో వారు నిద్రపోతున్నారని భావిస్తున్నారు.


నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన రూత్ లియోంగ్ మరియు మైఖేల్ చీ ప్రకారం ``డైలీ స్టార్'' నివేదించిన ప్రకారంజజ ``పగటి నిద్ర మానవ శరీరానికి అవసరం అండ్ జీవితంలో కూడా ఒక భాగం. పగటిపూట శరీరం బాగా అససి పోతుంది. దీంతో నిద్ర అనేది వస్తుంది. అలాంటప్పుడు.. ఉద్యోగులను నిద్రపోయేలా చేస్తే వారి ఉత్పాదకత పెరుగుతుంది. అంతే కాకుండా.. సంస్థ యొక్క లాభం కూడా పెరుగుతుంది. అంటే కాసేపు అలా నిద్ర పోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా అనిపించి ఉద్యోగులు రెట్టింపు వేగంతో పని చేస్తారని వాళ్ల అభిప్రాయం.ఆఫీసులో భోజనం చేసిన తర్వాత నిద్రపోవడం వల్ల కలిగే ప్రయోజనాలను 50 మందికి పైగా పరిశోధించారు. ఉద్యోగుల వయస్సుతో సంబంధం లేకుండా.. నిద్ర వారి పని శైలి మరియు ఉత్పాదకతలో తేడాను కలిగిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రకమైన పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, ఈ విషయం చైనాలో చాలా కాలంగా ప్రబలంగా ఉంది.


ఇది కూడా చదవండి : 4300 పోలీస్ కొలువుల భర్తీకి నోటిఫికేషన్.. త్వరలో ముగియనున్న దరఖాస్తుల గడువు.. 


పని చేస్తూ నిద్రపోవడం చైనాలో సర్వసాధారణం..
చైనాలో పని చేస్తూ నిద్రపోవడం మంచిదని భావిస్తారు. చైనాలో పని సమయంలో నిద్రపోయే వ్యక్తులు కష్టపడి పని చేస్తారని అందుకే వారికి నిద్ర వస్తుందని భావిస్తారు. బిజినెస్ ఇన్‌సైడర్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఇంటర్నెట్ కంపెనీలు గత ఆరు నుండి ఏడు సంవత్సరాలుగా భారీ వృద్ధిని చూస్తున్నాయి. కాబట్టి ఉద్యోగులు అధిక పని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోవడం లేదా రాత్రి ఆఫీసులో పడుకోవడం కంపెనీల్లో సర్వసాధారణమైపోయింది. వీటిని ఆయా కంపెనీలు కూడా ఒప్పుకోవడం గమనార్హం.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Lifestyle, Sleeping

ఉత్తమ కథలు