మార్చి నాటికి 50,000 ఉద్యోగాలు... ఈ రంగంపై దృష్టిపెట్టండి

ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. మో ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్-PLI స్కీమ్ ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి.

news18-telugu
Updated: November 19, 2020, 10:15 AM IST
మార్చి నాటికి 50,000 ఉద్యోగాలు... ఈ రంగంపై దృష్టిపెట్టండి
మార్చి నాటికి 50,000 ఉద్యోగాలు... ఈ రంగంపై దృష్టిపెట్టండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక రంగాల్లో సంక్షోభం నెలకొంది. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోతున్నాయి. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఉద్యోగాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అనేక పథకాలను ప్రకటిస్తోంది. అందులో భాగంగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్-PLI స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశంలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, విస్తరించడానికి విదేశీ సంస్థలతో పాటు దేశీయ సంస్థల్ని ప్రోత్సహించేందుకు ఈ స్కీమ్ ప్రకటించింది మోదీ ప్రభుత్వం. ఈ స్కీమ్ కారణంగా భారతదేశంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగం విస్తరించబోతోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో 2021 మార్చి నాటికి 50,000 ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయని అంచనా. ప్రస్తుతం భారతదేశంలో హ్యాండ్‌సెట్ సెక్టార్‌లో 7 లక్షల ఉద్యోగులు ఉన్నారు. గతేడాది 15,000 మందిని నియమించుకున్నారు. ఈసారి పీఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రోత్సాహకాలు ఉండటంతో కొత్త ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. అందుకు తగ్గట్టుగా ఉద్యోగాల సంఖ్య పెరగనుంది.

ONGC Recruitment 2020: ఆంధ్రప్రదేశ్‌లోని ఓఎన్‌జీసీలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్

DRDO Recruitment 2020: హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... వేతనం రూ.54,000

లాక్‌డౌన్ ఆంక్షల్ని తొలగించడంతో కంపెనీలు కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం, ఉన్న ఫ్యాక్టరీలను విస్తరించడంపై దృష్టిపెట్టాయి. ఇందుకోసం కావాల్సిన ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలో అనుభవం ఉన్నవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్, యూటీఎల్ నియోలింక్స్, లావా ఇంటర్నేషనల్, ఆప్టీమస్ ఎలక్ట్రానిక్స్, మైక్రోమ్యాక్స్ లాంటి సంస్థలు డిసెంబర్ చివరి నాటికి 20,000 ప్రత్యక్ష ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. గత నెలలో ప్రభుత్వం 10 మొబైల్ ఫోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. అందులో సాంసంగ్, ఫాక్స్‌కాన్‌కు చెందిన హోన్ హాయ్, రైజింగ్ స్టార్, విస్ట్రన్, పెగట్రాన్ లాంటి విదేశీ సంస్థలున్నాయి. ఈ సంస్థలకు ఐదేళ్లలో పీఎల్ఐ స్కీమ్ ద్వారా రూ.41,000 కోట్ల ప్రోత్సాహకాలు రానున్నాయి.

DRDO Scholarship: విద్యార్థులకు రూ.1,86,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు డిసెంబర్ 31 వరకు గడువు

SBI PO Recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే

భారతదేశంలో 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ కంపెనీలు మాత్రమే ఉండేవి. కానీ 2019 నాటికి 200 కంపెనీలు ఏర్పాటయ్యాయి. మొబైల్ ఫోన్ల తయారీ కూడా 6 కోట్ల నుంచి 29 కోట్లకు పెరిగింది. తయారైన మొబైల్ ఫోన్ల మార్కెట్ 30 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక 'In' బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్న మైక్రోమ్యాక్స్ రెండుమూడేళ్ల కోసం భారీ ప్రణాళికలే రూపొందిస్తోంది. మైక్రోమ్యాక్స్‌కు తెలంగాణలోని హైదరాబాద్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. నెలకు 10 లక్షల స్మార్ట్‌ఫోన్లను తయారు చేయగల సామర్థ్యం ఉంది. త్వరలోనే ఫ్యాక్టరీలను విస్తరించి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామని మైక్రోమ్యాక్స్ కోఫౌండర్, సీఈఓ రాహుల్ శర్మ ఇటీవల తెలిపారు.
Published by: Santhosh Kumar S
First published: November 19, 2020, 10:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading