హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో జాబ్స్... ఏదైనా డిగ్రీ పాసైతే చాలు

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో జాబ్స్... ఏదైనా డిగ్రీ పాసైతే చాలు

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో జాబ్స్... ఏదైనా డిగ్రీ పాసైతే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Bounce: బౌన్స్ స్టార్టప్‌లో జాబ్స్... ఏదైనా డిగ్రీ పాసైతే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Bounce | బెంగళూరుకు చెందిన బౌన్స్ స్టార్టప్‌ పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేస్తోంది. ఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఏదైనా డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.

భారతదేశంలో మొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ అయిన బౌన్స్‌లో (Bounce) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. వేర్వేరు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ అర్హతతోనూ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. బెంగళూరులో ఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులున్నాయి. డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు. విద్యార్హతలతో పాటు అనుభవం కూడా తప్పనిసరి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతల వివరాలన్నీ పూర్తిగా చదివిన తర్వాత ఇమెయిల్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. బౌన్స్‌లో ఆపరేషన్స్ విభాగంలో ఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసుకోండి.

విద్యార్హతలివే...


పోస్టు పేరుఆపరేషన్ ఎగ్జిక్యూటీవ్
రిపోర్టింగ్ మేనేజర్ హోదామేనేజర్
ప్రాంతంబెంగళూరు
విద్యార్హతలుఏదైనా డిగ్రీ పాస్ కావాలి
అనుభవం2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు
దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీcareers@bounceshare.com


IBPS Clerk 2022: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 6,035 జాబ్స్... అప్లై చేయండి ఇలా

కావాల్సిన స్కిల్స్


కస్టమర్ సక్సెస్ మేనేజర్ లేదా సాఫ్ట్‌వేర్ సపోర్ట్ మేనేజర్‌గా 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల అనుభవం తప్పనిసరి.

SaaS గురించి తెలిసి ఉండాలి.

ఇంగ్లీష్, హిందీ భాషలు తెలిసి ఉండాలి.

ఇతర భాషలు వస్తే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

ఎంపికైన వారు వెంటనే జాయిన్ కావాలి. లేదా నెల రోజుల లోపు జాయిన్ కావాలి.

ఆటోమొబైల్ అనుభవం తప్పనిసరి.

బాధ్యతలు


డీలర్లకు, డీఎంఎస్ కంపెనీకి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరించాలి.

కంపెనీ అందించే సేవల గురించి పూర్తి అవగాహన ఉండటంతో పాటు వాటిని డీలర్లకు వివరించాలి.

కొత్త డీలర్లను చేర్చుకోవడంతో పాటు శిక్షణ ఇవ్వాలి. ప్లాట్‌ఫామ్ పనితీరు, కాలానుగుణంగా వచ్చే మార్పులు, ఫీచర్స్ గురించి తెలియజేయాలి.

డీలర్ బృందానికి నిత్యం శిక్షణ ఇస్తూ ఉండాలి.

అవసరమైనప్పుడు కంపెనీ నిర్వహణ చూసుకోవడంతో పాటు, రీజనల్ టీమ్‌కు శిక్షణ ఇవ్వాలి.

డీలర్‌లను చురుగ్గా సంప్రదించి, ప్లాట్‌ఫారమ్‌లోని కొత్త ఫీచర్‌లను అర్థం చేసుకోవడంలో, ఎంగేజ్‌మెంట్ పెంచుకోవడంలో సహాయపడాలి.

రీజనల్ టీమ్‌కు లేదా మేనేజ్‌మెంట్‌కు అవసరమైన డేటాను అందించాలి.

Jobs in TCS: బీఏ, బీకామ్ పాసయ్యారా? టీసీఎస్‌లో ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

కంపెనీ గురించి


మొబిలిటీ సొల్యూషన్ స్టార్టప్ బౌన్స్ 2018 మే లో ప్రారంభమైంది. వివేకానంద హల్లికేరి, అనిల్ జీ, వరుణ్ అగ్ని మానసపుత్రికే బౌన్స్ స్టార్టప్. రోజువారీ ప్రయాణం ఒత్తిడి లేకుండా, వేగంగా, నమ్మకంగా, సౌకర్యవంతంగా చేసే లక్ష్యంతో బౌన్స్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్‌గా ప్రారంభించబడింది. రైడ్-షేరింగ్ అవతార్‌తో, వివిధ రోజువారీ ప్రయాణికుల కోసం సరసమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. సుదూర ప్రాంతాలను కవర్ చేయడం నుంచి లాస్ట్ మైల్ సపోర్ట్ వరకు అన్ని అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రారంభమైంది.


బెంగళూరులో మొదట లాంఛైనా ఆ తర్వాత కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు ప్రాంతాలకు విస్తరించింది. మొదటి ఏడాదిలోనే 30,000 పైగా స్కూటర్లతో రోజుకు 1,00,000 పైగా రైడ్స్ చేయడం విశేషం. రోజూ లక్షకు పైగా ట్రాన్సాక్షన్స్‌తో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందిన స్టార్టప్‌గా ఎదగడం విశేషం. మొదటి 11 నెలల్లోనే 500 మిలియన్ యూఎస్ డాలర్ల వ్యాల్యుయేషన్ చేరుకుంది. షేరింగ్ మొబిలిటీ బిజినెస్‌ను విస్తరిస్తూ, బౌన్స్ జ్యూనిక్‌లో ఇన్వెస్ట్ చేసింది. బౌన్స్ ఇన్ఫినిటీ పేరుతో భారతదేశంలోనే మొదటి స్వాపబుల్ బ్యాటరీ గల ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది.

First published:

Tags: Bounce, JOBS, Private Jobs, Startups

ఉత్తమ కథలు