స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా ఆఫీసర్ గ్రేడ్ A - జనరల్ స్ట్రీమ్ కింద అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 100 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వీటిలో 41 పోస్టులు జనరల్ కేటగిరీ కింద ఉండగా.. 12 పోస్టులు ఎస్సీ, 9 ఎస్టీ, 28 ఓబీసీ, 10 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. 4 పోస్టులు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు కేటాయించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ sidbi.inలో రిక్రూట్‌మెంట్ విభాగంలో అందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను 13 డిసెంబర్ 2022 నుండి 3 జనవరి 2023 వరకు సమర్పించాలి.
అంటే దరఖాస్తుల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్నది. దరఖాస్తు చేసేటప్పుడు, అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా రూ.1100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు రూ.175 మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. SIDBIలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా విభాగంలో PG డిగ్రీ లేదా లా లేదా ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ లేదా CA/ CS/ CWA/ CFA/ CMA లేదా Ph.D చేసి ఉండాలి.
అలాగే.. అభ్యర్థుల వయస్సు 14 డిసెంబర్ 2022 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 28 సంవత్సరాలకు మించకూడదు. అయితే, SC, ST, OBC (నాన్ క్రీమీ లేయర్), వికలాంగులు మొదలైన కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
రాత పరీక్ష..
మొత్తం 250 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, జనరల్ అవేర్ నెస్ నుంచి 50 మార్కులు, రీజనింగ్ నుంచి 60 మార్కులు, ఆప్టిట్యూడ్ నుంచి 60 మార్కులు, డిస్క్రిప్టివ్ 03 ప్రశ్నలకు 50 మార్కులు కేటాయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2022, JOBS