Home /News /jobs /

SKIT TO RECRUIT FOR 1000 VACANCIES IN TECHNICAL BUSINESS TEAMS FRESHERS CAN APPLY JNK GH

Skit Vacancies: ఫ్రెషర్స్​కు స్కిట్ గుడ్​న్యూస్​.. టెక్నికల్, బిజినెస్ టీమ్స్​లో కొత్తగా 1000 మందిని నియమించుకోనున్న సంస్థ

కొత్తగా 1000 మందిని నియమించుకోనున్న స్కిట్ ఐటీ సంస్థ

కొత్తగా 1000 మందిని నియమించుకోనున్న స్కిట్ ఐటీ సంస్థ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై పనిచేసే స్కిట్ కంపెనీ (Skit ) ఫ్రెషర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. వచ్చే ఏడాది కొత్తగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది.

కరోనా (Corona) తర్వాత ఐటీ రంగంలో (IT Sector) ఉద్యోగ నియామకాలు (Recruitment) జోరందుకున్నాయి. అనేక కంపెనీలు తమ కొత్త ప్రాజెక్ట్​లలో పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై పనిచేసే స్కిట్ కంపెనీ (Skit ) ఫ్రెషర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. వచ్చే ఏడాది కొత్తగా 1000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది. కంపెనీ బిజినెస్​, టెక్నాలజీ విస్తరణలో భాగంగా ఈ నియామక ప్రక్రియ చేపట్టనుంది. అమెరికా, ఆగ్నేయాసియా, భారతదేశంతో సహా మూడు ప్రధాన మార్కెట్లలో ఈ ఉద్యోగులను నియమించుకోనుంది. అయితే రిక్రూట్‌మెంట్‌లో ఎక్కువ భాగం భారతదేశంలోనే జరగనుంది. ప్రొడక్ట్​, మార్కెటింగ్​, సేల్స్, మెషిన్ లెర్నింగ్, ఇంజనీరింగ్, డెలివరీ, డేటా అన్నోటేషన్​, హెచ్​ఆర్​/రిక్రూట్‌మెంట్, సీఎక్స్​ఓ రోల్స్​లో అనుభవజ్ఞులు, ఫ్రెషర్లను నియమించుకోనుంది.

ఈ నియామకాలపై స్కిట్​ స్కిట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సౌరభ్ గుప్తా మాట్లాడుతూ "మా గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి, విస్తృత జనాభా కోసం మెరుగైన టెక్నాలజీ సేవలను అందించడాని ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల చేపట్టిన కొత్త ప్రాజెక్ట్​ల కోసం మరో 1000 మందిని నియమించుకోనున్నాం. రాబోయే సంవత్సరంలో కంపెనీ వృద్ధిరేటు 10 రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. స్కిట్ వృద్ధిలో ముందంజలో ఉండే మా సేల్స్, డెలివరీ, టెక్ టీమ్‌లను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. మేము ప్రస్తుతం నైపుణ్యం కలిగిన, ప్రతిభావంతులైన వ్యక్తుల కోసం పెట్టుబడి పెడుతున్నాం. కోడింగ్​, మెషిన్​ లెర్నింగ్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్ పై పనిచేసే నిపుణులను నియమించుకొని కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతాం. వాయిస్ ఇంటర్‌ఫేస్‌లు గల ఉండే ప్రపంచాన్ని సృష్టిస్తాం.” అని చెప్పారు.

NTPC Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. రూ. 60 వేల వేతనంతో NTPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి




2027 నాటికి 496 బిలియన్​ డాలర్ల ఆదాయమే లక్ష్యంగా..

సెప్టెంబర్ 2021 నాటికి, స్కిట్ కంపెనీ నికర ఆదాయం USD 30 మిలియన్లుగా ఉంది. ఈ ఆదాయం గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్ మార్కెట్​కు అనుగుణంగా క్రమంగా వృద్ధి చెందుతుందని, 2027 నాటికి 496 బిలియన్ US డాలర్లకు చేరుతుందని కంపెనీ అంచనా వేస్తుంది. టెలీ కాలర్ల అవసరం లేకుండా ఆటోమేటిక్​ వ్యవస్థను రూపొందించే ప్రాజెక్ట్​పై పనిచేస్తున్నామని, తద్వారా 60 శాతం వరకు ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపింది. ఈ వాయిస్ టెక్ ఆవిష్కరణను ఉపయోగించి కంపెనీని వృద్ధిని మరింత వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, కంపెనీ ప్రోడక్ట్, ఇంజినీరింగ్, రెవెన్యూ, మార్కెటింగ్, బోర్డ్ అపాయింట్‌మెంట్‌లు, హ్యూమన్ రిసోర్సెస్, గ్రోత్ విభాగాల్లో కీలకమైన సీనియర్ టెక్​ ఉద్యోగుల నియామకం చేపట్టింది.
Published by:John Kora
First published:

Tags: Freshers, Information Technology, Vacancies

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు