SKILL DEVELOPMENT CORPORATION INITIATIVE FOR UNDERPRIVILEGED YOUTH OFFERING COURSES ON IT LOGISTICS RETAIL AND TELECOM GH VB
NSDC: యువత కోసం NSDC ప్రత్యేక చొరవ.. స్కిల్ డెవలప్మెంట్ కొరకు కొత్త కోర్సులు.. వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) నిరుపేద యువతకు నైపుణ్యం పెంపొందించే కోర్సులను అందించడానికి ఉదయన్ కేర్‌తో భాగస్వామ్యం కుదర్చుకుంది. BFSI, ఐటీ, లాజిస్టిక్స్, రిటైల్, టెలికాంపై కోర్సులను సంస్థ ఆఫర్ చేస్తోంది.
నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) నిరుపేద యువతకు నైపుణ్యం పెంపొందించే కోర్సులను(Courses) అందించడానికి ఉదయన్ కేర్‌తో భాగస్వామ్యం కుదర్చుకుంది. BFSI, ఐటీ(IT), లాజిస్టిక్స్, రిటైల్(Retail), టెలికాంపై (Telecom) కోర్సులను సంస్థ ఆఫర్(Offer) చేస్తోంది. యువత ఉపాధి పొందేలా వారిని ఆర్థికంగా స్వతంత్రంగా తీర్చిదిద్దే కోర్సులను సంస్థలు అందిస్తున్నాయి. 18-25 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు వివిధ ప్రమాణాలను బట్టి కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పునరావాస కాలనీలు, మురికివాడల సంఘాల నుండి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఒక్కో కోర్సుకు(Course) నెలకు రూ.300-500 పరిధిలో ఫీజు(Fee) చెల్లించాల్సి ఉంటుంది. అణగారిన కుటుంబాల నుండి వచ్చే విద్యార్థులకు ఉచిత షిప్‌ల సదుపాయం కూడా ఉంది.
దరఖాస్తు అర్హత ప్రమాణాలు
గ్రాడ్యుయేట్లు లేదా రెండు లేదా మూడో సంవత్సరం బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులు, సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించేవారు సైతం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆర్థికంగా వెనుకబడి, కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 2.5 లక్షలకు మించని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అసాధారణ పరిస్థితుల్లో కుటుంబ నెలవారీ ఆదాయం 2.5 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* కోర్సుల జాబితా
అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ (రికార్డింగ్, రిపోర్టింగ్), డేటా ఎంట్రీ ఆపరేటర్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్ (DTP), రిసీవింగ్ అసిస్టెంట్, రిటైల్ సేల్స్ అసోసియేట్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ - కాల్ సెంటర్, రిలేషన్ షిప్ సెంటర్ తదితర అంశాలపై కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
NSDC CEO వేద్ మణి తివారీ మాట్లాడుతూ.. NSDC పార్టనర్స్ నెట్‌వర్క్‌గా ఉదయన్ కేర్‌ను స్వాగతిస్తున్నామన్నారు. ప్రతి వ్యక్తికి, ఎక్కడైనా, ఎప్పుడైనా సరసమైన నైపుణ్య అవకాశాలను అందించడానికి NSDC పార్టనర్స్ నెట్వర్క్ కట్టుబడి ఉందన్నారు. అలాంటి వ్యక్తుల సామాజిక, ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి అవకాశాలతో నైపుణ్యాలను అనుసంధానిస్తు్న్నామని ఆయన పేర్కొన్నారు. చైల్డ్ అండ్ యూత్ కేర్, ఎడ్యుకేషన్, స్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించిన ఉదయన్ కేర్‌తో చేతులు కలపడం ద్వారా NSDC పార్ట్నర్స్ నెట్‌వర్క్‌ను విస్తరించడంలో సహాయపడుతుందన్నారు.
ఉదయన్ కేర్ అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. NSDCతో భాగస్వామ్యం ఉదయన్ కేర్ స్కిల్ ప్రోగ్రాం క్యాప్‌కు ఒక కొత్త రెక్కను జోడించడంలాంటిదన్నారు. నిరుపేద విద్యార్థులకు విస్తృత శ్రేణి కోర్సులు, ప్రభుత్వ ధ్రువీకరణను సులభంగా యాక్సెస్ చేయడంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వచ్చే మూడేళ్లలో 5000 మంది యువతకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు... ఉదయన్ కేర్ IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, లాజిస్టిక్స్, టెలికాం వంటి కొత్త ఉద్యోగ రంగాలలోకి కూడా ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు.
ఎన్ఎస్డీసీ భాగస్వామ్యం ద్వారా ఐటి సెంటర్ ప్రోగ్రామ్‌లను కొత్త శిఖరాలకు చేరుతాయని, దీంతో యువతకు వివిధ రకాల నైపుణ్య శిక్షణను అందించడానికి అవకాశం ఉంటుందని మనోజ్ తెలిపారు. విద్యార్థులు ఉపాధి పొందేలా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఎంతో సహాయ సహకారాలు అందిస్తామన్న గట్టి నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.