హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni Junior Assistant: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నిలిపివేత..

Singareni Junior Assistant: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నిలిపివేత..

Singareni Junior Assistant: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నిలిపివేత..

Singareni Junior Assistant: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నిలిపివేత..

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. ఈ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగినట్లు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

సింగరేణి జూనియర్ అసిస్టెంట్(Singareni Junior Assistant) ఉద్యోగాల భర్తీకి బ్రేక్ పడింది. ఈ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగినట్లు పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీంతో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీని తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేయాలని హైకోర్టు(High Court) ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Government Job Notifications: TSPSCతో సహా.. ఈ వారం దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే..

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షలు, విద్యార్హతలు ఇతర అంశాల్లో అవకతవకలు జరిగాయని కొంత మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్లు తన వాదనకు ఆధారాలు చూపించారని.. తదుపరి నిర్ణయం వెలువడే వరకూభర్తీని నిలిపివేయాలని ఆదేశించింది.

జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ – 2 పరీక్షను ఇటీవలే నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ తాము అంతా సక్రమంగానే చేశామని సింగరేణి అధికారులు, అటు జేఎన్‌టీయూ అధికారులు చెబుతునప్పటికీ పరీక్ష జరిగే రోజునే కొంత మంది అభ్యర్ధులను గోవాకు తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడే పేపర్‌ లీకైందని ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసిన సింగరేణి యాజమాన్యం, జేఎన్‌టీయూ అధికారులు హడావుడిగా పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు మొదలవ్వగా.. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వీకరణ ముగిసింది. దీనికి సంబంధించి ఈ పరీక్ష సెప్టెంబర్ 4, 2022 న నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. మొత్తం ఒకే షిప్ట్ లో పరీక్ష నిర్వహించారు.

ఇక పరీక్ష జరిగిన అదే రోజు గోవాలో పేపర్ లీక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సింగరేణి యాజమాన్యం ఖండించింది. ఎలాంటి అవకతవకలు జరగలేదని క్లారిటీ ఇచ్చింది. అదే రోజు అర్హత సాధించిన వారి జాబితాను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. దీనిలో కూడా అన్నీ తప్పులతడకగా అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే తప్పులు చేశారని.. వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని.. వాళ్లను పరీక్ష రాయించినట్లు పేర్కొన్నారు.

Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖలో మరో నోటిఫికేషన్.. ఖాళీల వివరాలిలా..

అయితే పరీక్ష జరిగిన సమయంలో అభ్యర్థులను తనిఖీ చేయలేదని.. ప్రశ్నాపత్రానికి కూడా ఎలాంటి సీలు లేకుండా అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ఇచ్చారని పలువురు పేర్కొన్నారు. దీంతో దీనిపై కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆదేశించారు. ముందే పేపర్ లీక్ చేసి.. పరీక్షను నిర్వహించారని.. ఈ పోస్టులను ముందే అమ్ముకున్నారని అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా గోడు వెల్లబోసుకున్నారు. తాజాగా హైకోర్టు ఉద్యోగాల భర్తీ విషయంలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni, Singareni Collieries Company

ఉత్తమ కథలు