హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni Junior Assistant Update: 3 వేల మందికి పైగా హాల్ టికెట్స్ నిలిపివేత.. కారణం ఏంటంటే..

Singareni Junior Assistant Update: 3 వేల మందికి పైగా హాల్ టికెట్స్ నిలిపివేత.. కారణం ఏంటంటే..

Singareni Junior Assistant Update: 3 వేల మందికి పైగా హాల్ టికెట్స్ నిలిపివేత.. కారణం ఏంటంటే..

Singareni Junior Assistant Update: 3 వేల మందికి పైగా హాల్ టికెట్స్ నిలిపివేత.. కారణం ఏంటంటే..

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్లరికల్‌ జాబ్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లోకి(Clerical Cadre Non Executive Cadre)వస్తుంది. జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు మొదలవ్వగా.. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వీకరణ ముగిసింది. https://scclmines.com/scclnew/index.aspవెబ్ సైట్ లో పరీక్ష తేదీని వెల్లడించారు. సెప్టెంబర్ 4, 2022 న పరీక్షను నిర్వహించనున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. ఒకే షిప్ట్ లో పరీక్షను నిర్వహించనున్నారు.అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లను కూడా ఆగస్టు 28 ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంచారు. ఈ లికం్ క్లిక్ చేయడం ద్వారా https://scclmines.com/scclnew/careers_hallticket.asp హాల్ టికెట్స్ ను పొందొచ్చు.


Jobs In Canara Bank: కెనరా బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..


ఇదంతా ఇలా ఉంటే.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరో అప్ డేట్ ను వెట్ సైట్లో పొందుపరిచారు. ఈ పరీక్ష మొత్తం 8 జిల్లాల్లోని 187 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు.. దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు డైరెక్టర్ (పర్సనల్, ఆపరేషన్స్) శ్రీ ఎస్.చంద్రశేఖర్ వెల్లడించారు. 177 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 1.02 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. అయితే అర్హతలున్న 98,880 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లను జారీ చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను http://tssccl.onlineportal.org.in/SiteContent/Halltickets వెబ్ లింక్ ను ఓపెన్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థి అప్లికేషన్ నెంబర్ లేదా రిజిస్టర్టు మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయడం ద్వారా వారికి సంబంధించిన హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.సెప్టెంబరు 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని, అలాగే హాల్ టికెట్లో ఇచ్చిన సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.


CUET UG- 2022: సీయూఈటీ ద్వారా అడ్మిషన్స్.. ప్రవేశాలు కల్పిస్తున్న టాప్ యూనివర్సిటీలు, కాలేజీలు ఇవే..


జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినందున తెలంగాణలోని 8 జిల్లాల్లో 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు డైరెక్టర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ తెలిపారు.


పరీక్షా కేంద్రంపరీక్ష కేంద్రాల సంఖ్య
హైదరాబాద్ - 119
హైదరాబాద్ - 214
కరీంనగర్39
ఖమ్మం23
వరంగల్18
మంచిర్యాల28
ఆదిలాబాద్11
భద్రాద్రి కొత్తగూడెం35
                                          మొత్తం187


హైదరాబాద్ 1, 2, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రతీ రీజియన్ కు ఒక్కో ఒక్కో చీఫ్ కో ఆర్డినేటర్ ను నియమించామని, ప్రతీ కేంద్రానికి పర్యవేక్షకులు ఉంటారని తెలిపారు. 

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni, Singareni Collieries Company

ఉత్తమ కథలు