హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni Halltickets Released: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.. 

Singareni Halltickets Released: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.. 

Singareni Halltickets Released: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.. 

Singareni Halltickets Released: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్ లోడ్ చేసుకోండి.. 

Singareni JA Halltickets: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్లరికల్‌ జాబ్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లోకి(Clerical Cadre Non Executive Cadre)వస్తుంది. జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు మొదలవ్వగా.. జులై 10 వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు స్వీకరణ ముగిసింది. నోటిపికేషన్‌లో(Notification) అర్హతలు, ఉద్యోగాల వారీగా ఖాళీలు, అప్లికేషన్ ఫీజు(Application Fee), ఎంపిక విధానం మొత్తం వివరంగా ఇచ్చినా.. పరీక్ష తేదీ మాత్రం ఇవ్వలేదు. దీనిని తర్వాత వెబ్ సైట్లో అప్ డేట్ చేశారు.https://scclmines.com/scclnew/index.aspవెబ్ సైట్ లో పరీక్ష తేదీని వెల్లడించారు.


TSLPRB Constable Exam: కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులకు ముఖ్య సూచన.. పరీక్ష హాల్లో ఇలా ఉండండి..


సెప్టెంబర్ 4, 2022 న పరీక్షను నిర్వహించనున్నట్లు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. ఒకే షిప్ట్ లో పరీక్షను నిర్వహించనున్నారు.అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లకు సంబంధించి మరో అప్ డేట్ ను వెట్ సైట్లో పొందుపరిచారు. ఆగస్టు 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆ సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అంటే నేడు ఉదయం 11 గంటల నుంచి ఈ హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నట్లు వెబ్ సైట్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలుhttps://scclmines.com/scclnew/careers_hallticket.asp ఈ లింక్ లో పొందు పరిచారు.సెప్టెంబర్ 4న నిర్వహించే ఈ రాత పరీక్షలో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు 120 ఉంటాయి. ఇందులో వచ్చిన మార్కులను 100 శాతానికి పర్సంటైల్ చేసి జాబితాను విడుదల చేస్తారు. వీటిలో మెరిట్ లో మార్కులు వచ్చిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు పిలుస్తారు.  పరీక్షలో అభ్యర్థులను ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఆప్టిట్యూట్‌, జనరల్ స్టడీస్‌, కరెంట్‌ అఫైర్స్, ఇండియా అండ్‌ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్‌ హెరిటేజ్‌, అర్థమేటిక్‌ అప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌ పై ప్రశ్నలను అడుగుతారు. సింగరేణి ఉద్యోగాలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ (పర్సనల్) ఎస్ చంద్రశేఖర్ గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.


Easy To Get 60 Marks: 60 మార్కులు తెచ్చుకోవడం ఇంత సులువా.. కానిస్టేబుల్ కు ఈ ఒక్క స్ట్రాటజీ చాలు.. 60 మార్కులు వచ్చినట్లే..


సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని.. అటువంటి వాళ్ల మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. ఎవరైనా ఇలాంటి వారు ఉన్నట్లు మీ దృష్టికి వస్తే.. 9491145075 నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన అభ్యర్థులకు సూచించారు.


హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ఇలా..


-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.


-తర్వాత వెబ్ సైట్ టాప్ లో కనిపిస్తున్న కెరీర్ అనే ఆప్షన్ లో రిక్య్రూట్ మెంట్ ను ఎంచుకోవాలి. తర్వాత ఎడమ వైపు కొన్ని కేటగిరీలు కనిపిస్తాయి.


-ఎడమ వైపు కనిపిస్తున్న వాటిలో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


-తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దనీలో హాల్ టికెట్స్ డౌన్ లోడ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేయాలి.


-తర్వాత మీ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకొని .. ప్రింట్ తీసుకోవాలి.


-అభ్యర్థులు పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్స్ లో పొందుపరిచిన నిబంధనలను కచ్చితంగా చదువుకోవాలని అధికారులు సూచించారు. నేడు ఉదయం 11 గంటల నుంచి హాల్ టికెట్స్ అందుబాటులో ఉండనున్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni, Singareni Collieries Company

ఉత్తమ కథలు