తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు వివిధ కార్పొరేషన్లు, రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఖాళీలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సింగరేణి సంస్థలోనూ 651 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎండీ శ్రీధర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మార్చి నాటికి ఇందుకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సింగరేణిలో కొలువులకు కూడా మంచి మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో అభ్యర్థుల నడుమ తీవ్ర పోటీ ఉంటుంది. త్వరలో ఉద్యోగాల ప్రకటన వస్తుండడంతో అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
ఫిట్టర్-128
ఎలక్ట్రీషియన్ ట్రైనీ-51
వెల్డర్ ట్రైనీ-54
జూనియర్ అసిస్టెంట్(క్లరికల్)-177
మోటార్ మెకానిక్ ట్రైనీ-14
టర్నర్, మిషినిస్టు ట్రైనీ-22
ల్యాబ్ టెక్నీషియన్లు-7
జూనియర్ స్టాఫ్ నర్సు-84
ఎక్స్ రే, ఈసీజీ,వెంటిలేటర్ అసిస్టెంట్-6
ఫిజియోథెరపీ, వెంటిలేటర్-2
మొత్తం-569
అధికారుల విభాగంలో ఖాళీలు..
మేనేజ్మెంట్ ట్రైనీ-39
పర్సనల్ ఆఫీసర్లు-17
మేనేజ్మెంట్ ట్రైనీ(సివిల్)-7
మేనేజ్మెంట్ ట్రైనీ(ఐటీ)-6
మేనేజ్మెంట్ ట్రైనీ(ఐఈడీ)-10
జూనియర్ ఫారెస్టు ఆఫీసర్ ట్రైనీ: 3
మొత్తం:82
ఎంపిక ఎలా అంటే..
ప్రతిభ ఆధారంగా ఆయా ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని సింగరేణి యాజమాన్యం తెలుపుతోంది. రాత పరీక్షలో వచ్చే మార్కులనే ప్రమాణికంగా తీసుకుంటామని, మౌఖిక పరీక్ష ఉండదని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని సంస్థ స్పష్టం చేస్తోంది. మోసగాళ్ల మాటలు నమ్మి అభ్యర్థులు నష్టపోవద్దని సూచిస్తోంది.
1,432 అంతర్గత పోస్టుల భర్తీకి చర్యలు..
మొత్తం 651 నూతన పోస్టులతో పాటు అంతర్గతంగా ఉన్న మరో 1,432 పోస్టులను సైతం భర్తీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమవుతోంది. యాజమాన్యం నిర్ణయంతో పదోన్నతి కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారిలో హర్షం వ్యక్తం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, JOBS, Singareni, Singareni Collieries Company, Telangana