హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Singareni Junior Assistant Key: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. ప్రాథమిక కీ విడుదలపై కీలక అప్ డేట్..

Singareni Junior Assistant Key: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. ప్రాథమిక కీ విడుదలపై కీలక అప్ డేట్..

Singareni Junior Assistant Key: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. ప్రాథమిక కీ విడుదలపై కీలక అప్ డేట్..

Singareni Junior Assistant Key: సింగరేణి అభ్యర్థులకు అలర్ట్.. ప్రాథమిక కీ విడుదలపై కీలక అప్ డేట్..

Singareni Junior Assistant Key: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష సెప్టెంబర్ 4, 2022 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విజయవంతంగా ముగిసింది. దీనికి సంబంధించి ప్రాథమిక కీ విడుదలపై కీలక ప్రకటన చేశారు బోర్డు నిర్వాహకులు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష(Singareni Junior Assistant Exam) సెప్టెంబర్ 4, 2022 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విజయవంతంగా ముగిసింది. దీనికి సంబంధించి ప్రాథమిక కీ విడుదలపై కీలక ప్రకటన వెల్లడించారు.  పూర్తి వివరాల్లోకి వెళ్తే..  సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(Singareni Collieries Company Limited) 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 20th జూన్ 2022న రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి పరీక్ష నేడు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విజయవంతంగా ముగిసింది. తెలంగాణలోని 8 జిల్లాల్లో 187 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.   హైదరాబాద్ 1, 2, కరీంనగర్, వరంగల్(Warangal), ఖమ్మం(Khammam), భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల(Mancherial), ఆదిలాబాద్(Adilabad) జిల్లాల్లో ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణకు ప్రతీ రీజియన్ కు ఒక్కో చీఫ్ కో ఆర్డినేటర్ ను నియమించారు.

TSPSC Notification: TSPSC నుంచి 1540 పోస్టులతో మరో నోటిఫికేషన్.. పూర్తి వివరాలిలా..


మొత్తం 90వేలకు పైగా అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోగా.. దాదాపు 77 వేలకు పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. అత్యంత పకడ్బందీగా సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాతపరీక్షను నిర్వహించినట్లు జూనియర్ అసిస్టెంట్ పరీక్ష కన్వీనర్, జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. పటిష్ట పోలీస్ బందోబస్తుతో ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించామని.. పరీక్షకు హాజరుకాని అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లను, ప్రశ్నాపత్రాలను వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి పరీక్ష పూర్తయ్యే వరకు సింగరేణి విజిలెన్స్ విభాగం అప్రమత్తంగా వ్యవహరించిందన్నారు. మోసగాళ్లు, మాయమాటలు చెప్పే వారిపై తగిన ఆధారాలతో ఫిర్యాదులు సమర్పిస్తే అత్యంత గోప్యంగా విచారణ చేపట్టి నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Postal Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..


వారి సమాచారాన్ని కచ్చితమైన ఆధారాలతో విజిలెన్స్ విభాగం నంబర్ 9491145075 లేదా vig@scclmines.com కు మెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుందన్నారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి అర్హులైన నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న సింగరేణి లక్ష్యానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని, మాయ మాటలు చెప్పే మోసగాళ్లను ఆటకట్టించాలన్నారు.


Inter Qualification Jobs: ఇంటర్ పూర్తి చేశారా.. ఈ ఉద్యోగాలు మీ కోసమే.. దరఖాస్తు చేసుకోండిలా.. 

ఇదంతా ఇలా ఉంటే.. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ కు సంబంధించి ప్రాథమిక కీని నేడు అనగా సెప్టెంబర్ 05, 2022న అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని.. దీనికి సంబంధించి వెబ్ సైట్లో సమాచారాన్ని పొందుపరిచారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ పేపర్ కు సంబంధించి కీ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే.. సింగరేణి వెబ్ సైట్ https://scclmines.com/scclnew/index.asp ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని జూనియర్ అసిస్టెంట్ పరీక్ష కన్వీనర్, జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Singareni, Singareni Collieries Company

ఉత్తమ కథలు