Adar Poonawalla: విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు అడర్ పూనావల్లా సాయం..రూ.10 కోట్ల విరాళం

అదర్ పూనావాలా (Image: Facebook)

అర్హులైన విద్యార్థులకు క్వారంటైన్ ఖర్చుల కోసం అన్‌లాక్ ఎడ్యుకేషన్ ఫండ్ కింద రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యంగా లోన్లు, స్కాలర్‌షిప్స్‌తో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

  • Share this:
    మన దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.  కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను వేస్తున్నారు. ఇప్పటికే 40 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం తెలంగాణతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి టీకాలు ఇచ్చారు. ఐతే పలు దేశాలు కోవిషీల్డ్‌ను యాక్సెప్టబుల్ వ్యాక్సిన్‌గా ఇప్పటికీ ఆమోదించలేదు. అంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఆయా దేశాల్లో నేరుగా తిరగలేరు. అక్కడ అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా క్వారంటైన్లో ఉండాల్సిందే. క్వారంటైన్ పీరియడ్ పూర్తైన తర్వాతే బయట తిరిగేందుకు అనుమతిస్తారు. ఐతే ఆ క్వారంటైన్ ఖర్చులను కూడా విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లిన చాలా మంది స్టూడెంట్స్ కరోనా పరీక్షలు, హోటల్స్‌లో క్వారంటైన్‌కు లక్షలకు లక్షలు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.

    యూకే ప్రభుత్వం భారత్‌ను రెడ్ లిస్ట్ జాబితాలో పెట్టింది. అంటే భారత్ నుంచి వచ్చే విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా.. 10 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఇలా యూకేతో పాటు ఇతర దేశాల్లో కరోనా రూల్స్ వల్ల ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల కోసం కెటోతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అన్‌లాక్ ఎడ్యుకేషన్ పేరిట ఫండ్ రైజింగ్ చేస్తున్నాయి. ఎవరైనా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే తమ వివరాలను ఆన్‌లైన్ ఫామ్‌లో నమోదు చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వారికి ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం చేస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సాయం చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అడర్ పూనావల్లా కూడా ముందుకొచ్చారు. తాను రూ.10కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు,.



    అర్హులైన విద్యార్థులకు క్వారంటైన్ ఖర్చుల కోసం అన్‌లాక్ ఎడ్యుకేషన్ ఫండ్ కింద రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్యంగా లోన్లు, స్కాలర్‌షిప్స్‌తో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. యూకేలో చాలా మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని నిబంధనలను విధించింది. పది రోజుల పాటు యూకే ప్రభుత్వం అప్రూవ్ చేసిన హోటళ్లలో ఉండాలంటే దాదాపు రూ. 2 లక్షలు ఖర్చవుతుంది. ఈ నేపథ్యంలోనే అర్హులైన విద్యార్థులకు సాయం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. అన్‌లాక్ ఎడ్యుకేషన్ కార్యక్రమం పేరుతో నిధులను సమీకరిస్తున్నాయి. ఇందులో అందరూ భాగస్వామ్యమై విదేశాల్లో చదవుకుంటున్న విద్యార్థులకు సాయం చేయాలని కోరుతున్నాయి. ఈ కార్యక్రమానికి క్రౌండ్ ఫండింగ్ పార్ట్‌‌నర్‌గా కేటో వ్యవహరిస్తుండగా.. సన్మాట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్‌నర్‌గా ఉంది.

    విరాళం ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

    సెల్ఫ్ క్వారంటైన్ ఫెసిలిటీ ఫండ్స్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇవి కూడా చదవండి:

    12 ఏళ్లకు ఓసారి మాత్రమే వికసించే నీలకురింజి పువ్వులు.. ప్రత్యేకత  ఏంటో తెలుసా?

    HDFC Recruitment: కరోనా కాలంలో పాసైన డిగ్రీ అభ్యర్థులు అనర్హులు..!
    Published by:Shiva Kumar Addula
    First published: