నిరుద్యోగులకు 2023 అంతా ఉద్యోగాల జాతరే అని చెప్పవచ్చు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు(Notifications) విడుదల అవుతున్నాయి. కేంద్రం నుంచి కూడా 2023 జనవరి నుంచి వరుస నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. వీటితో పాటు.. బ్యాంక్ ఉద్యోగాలు(Jobs), అగ్నివీర్ కొలువులతో పాటు నాన్ బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి. వీటిలో భాగంగానే తాజాగా SIDBI పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఎ' పోస్టులను రిక్రూట్ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఎ' పోస్టులను రిక్రూట్ చేయనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.sidbi.inని సందర్శించడం ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీగా జనవరి 03, 2023గా నిర్ణయించారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా.. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 'ఎ' - జనరల్ స్ట్రీమ్ మొత్తం 100 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష జనవరి/ఫిబ్రవరి 2023లో నిర్వహించనున్నారు.
విద్యార్హతలు..
అభ్యర్థి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. (కామర్స్ / ఎకనామిక్స్ / మేనేజ్‌మెంట్ డిసిప్లిన్ నుండి) లేదా లాలో బ్యాచిలర్ డిగ్రీ / ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ / సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ / యూనివర్శిటీ నుంచి సివిల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్) లేదా CA / CS / CWA / CFA / CMA లేదా Ph.D పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు..
దరఖాస్తు చేసుకునే జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులు రూ.1100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC / ST / PWBD కేటగిరీ అభ్యర్థులు ఫీజుగా రూ. 175 చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.