ఏపీలో 411 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష నేడు(ఫిబ్రవరి 19) ప్రశాంతంగా ముగిసింది. ఉదయం, సాయంత్రం రెండు షిప్ట్ లో అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం రెండు షిఫ్ట్ లల్లో 1.51 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరైనట్లు ఏపీఎస్ ఎల్పీఆర్బీ(APSLPRB) పేర్కొంది. అంతే కాకుండా.. ఈ పరీక్షకు సంబంధించి ప్రలిమినీర కీని ఎప్పుడు విడుదల చేసే విషయాన్ని కూడా అధికారులు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ కీ విడుదల చేయస్తున్నట్లు తెలిపారు. కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అభ్యర్థులు SCTSI-PWT@slprb.appolice.gov.in కు మెయిల్ చేయాలని తెలిపారు. దీనికి ఫిబ్రవరి 23 వరకు అవకాశం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఫలితాలను కూడా రెండు వారాల్లోగా విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ఏపీలో 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన నియామక పరీక్ష (AP SI Prelims Exam) ఫిబ్రవరి 19న నిర్వహించారు. ఇందుకు సంబంధించి మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. దీంతోరాష్ట్ర వ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరిలో 1.50లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.
సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇందులో సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలకు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్ సందర్శించాలని బోర్డు తెలిపింది.
మొత్తం 6,100 పోస్టుల భర్తీ కోసం గతనెల 22న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో దీన్ని నిర్వహించినట్లు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 30 శాతం కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే వీటికి ఇటీవల ఫలితాలను వెల్లడించారు. కానిస్టేబుల్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. రెండో ఫేస్ దరఖాస్తులు ఫిబ్రవరి 13 నుంచి మొదలయ్యాయి. దీనికి రేపటితో(ఫిబ్రవరి 20) దరఖాస్తుల గడువు ముగియనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap police jobs, JOBS