హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Shoolini University: శూలిని యూనివర్సిటీ నుంచి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు.. పే-ఆన్-ప్లేస్‌మెంట్ ఆప్షన్‌తో లాంచ్

Shoolini University: శూలిని యూనివర్సిటీ నుంచి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు.. పే-ఆన్-ప్లేస్‌మెంట్ ఆప్షన్‌తో లాంచ్

 ఆన్‌లైన్ కొత్త కోర్సులు

ఆన్‌లైన్ కొత్త కోర్సులు

అకడమిక్ విధానంలో ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తోంది హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శూలిని యూనివర్సిటీ (Shoolini University). ఈ కోర్సులను పే-ఆన్-ప్లేస్‌మెంట్ ఆప్షన్‌తో డెలివరీ చేయనుంది. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇటీవల కాలంలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. పైగా ఖర్చు తక్కువ, ఇంటి నుంచే కోర్సులను పూర్తి చేయవచ్చనే కారణంతో చాలా మంది విద్యార్థులు (students) ఈ కోర్సుల్లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. తాజాగా అకడమిక్ విధానంలో ఆన్‌లైన్ డిగ్రీ (Degree) కోర్సులను ఆఫర్ చేస్తోంది హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శూలిని యూనివర్సిటీ (Shoolini University). ఈ కోర్సులను పే-ఆన్-ప్లేస్‌మెంట్ ఆప్షన్‌తో డెలివరీ చేయనుంది. ఇప్పటికే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను పే-ఆన్-ప్లేస్‌మెంట్ ఆప్షన్‌తో ప్రారంభించింది శూలిని యూనివర్సిటీ. ఈ విధానం ప్రకారం.. విద్యార్థులు ప్రతి సెమిస్టర్ ప్రారంభంలో ట్యూషన్ ఫీజులో 50 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ఏదైనా కంపెనీలో ప్లేస్‌మెంట్ సాధించిన తరువాత చెల్లించవచ్చు. అంటే విద్యార్థులు సగం ఫీజుతోనే ఆన్‌లైన్ మోడ్‌లో, ఇంటి నుంచే డిగ్రీ కోర్సులు చదివే అవకాశం ఉంటుంది.

పడిపోతున్న ధరలు.. బంగారం కొనేందుకు ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు!

అన్ని కోర్సులను యూజీసీ ఎన్ టైటిల్డ్ కేటగిరీ ప్రకారం డెలివరీ చేయనున్నారు. యూజీసీ 4-క్వాడ్రంట్ విధానం ప్రకారం, ఇంగ్లీషుతో పాటు స్థానిక భాషల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆడియో, వీడియో, రీడింగ్ కంటెంట్ ఫీచర్ ఈ యూనివర్సిటీ సొంతం.

ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం.. వారికి అదిరిపోయే శుభవార్త!

శూలిని యూనివర్సిటీ బీబీఏ, బీకామ్(ఆనర్స్), బీఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌ వంటి డిగ్రీ కోర్సులతో పాటు ఏంఏ ఇంగ్లీష్ కోర్సును సైతం ఆఫర్ చేస్తోంది. యూజీసీ గైడ్‌లైన్స్ ప్రకారం కోర్సులు ఈ ఏడాది నవంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. యూనివర్సిటీ క్యాంపస్ విజిట్ చేయాల్సిన అవసరం లేకుండానే డిగ్రీ కోర్సులను విద్యార్థులు పూర్తి చేయవచ్చు. టాప్ ఎక్స్‌ఫర్ట్స్, అకడమిక్ కోర్సులు, ఇండస్ట్రీ నాలెడ్జ్‌తో పాటు ఇండస్ట్రీ ఇంటర్న్ షిప్స్, ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థులు చాలా ప్రయోజనం పొందనున్నారని శూలిని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ విశాల్ ఆనంద్ చెప్పుకొచ్చారు.

యూనివర్సిటీకి చెందిన యోగానంద స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్, ఇన్నోవేషన్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ ఆశిష్ ఖోస్లా మాట్లాడుతూ.. ఆన్‌లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా ఉద్యోగ నియామకాలపై దృష్టి పెడతామన్నారు. ‘మంచి ఉద్యోగాలు సాధించడంలో సహాయపడే నైపుణ్యాలు, నాలెడ్జ్‌ను ఈ ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు సంపాదిస్తారు. వారికి ప్లేస్‌మెంట్ కల్పించేలా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిటైల్, మీడియా, హాస్పిటాలిటీ వంటి రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్నాం. ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలి’ అని వెల్లడించారు.

First published:

Tags: EDUCATION, JOBS, Students

ఉత్తమ కథలు