Home /News /jobs /

Jagananna Vidya Deevena: ఇకపై విద్యాదీవెన తల్లుల అకౌంట్ లో పడదు.. హైకోర్టు తీర్పుతో ఏపీలో విద్యా సంస్థలకు ఊరట

Jagananna Vidya Deevena: ఇకపై విద్యాదీవెన తల్లుల అకౌంట్ లో పడదు.. హైకోర్టు తీర్పుతో ఏపీలో విద్యా సంస్థలకు ఊరట

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

Big shock: ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మరోషాక్ తగిలింది. ఇప్పటి వరకు తల్లుల ఖాతాలో వేస్తున్న విద్యా దీవెన కానుక నగదు.. ఇకపై కాలేజీల ఖాతాలో వేయాల్సి ఉంటుంది..

  Jagananna Vidya Deevena: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) వరుస షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh  Highcourt) తీర్పు షాక్ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పథకాల్లో జగనన్న విద్యా దీవెన (Jagananna Vidya deevena) ఒకటి.. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్నితల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. వైఎస్‌ జగన్‌ మోహన్  రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం అయితే తాజాగా జగనన్న విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో డబ్బు జమపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

  విద్యా దీవెన కింద విద్యార్థులకు చెల్లించే ఫీజులను నేరుగా కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లోనే జమ చేయాలని న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ కోర్టును కోరారు. కృష్ణదేవరాయ విద్యా సంస్థల తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తల్లులు ఫీజు కట్టకుంటే తమకు సంబంధం లేదని ప్రభుత్వం అంటోందని పిటిషన్‌ర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో, ఫీజులను నేరుగా విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయాలని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

  ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇకపై విద్యా దీవెన మొత్తాన్ని విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్‌ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తీర్పు కాపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది.

  ఇదీ చదవండి: ఆదర్శమంటే ఇదే.. కొడుకును ప్రభుత్వ కాలేజీలో జాయిన్ చేసిన ఉన్నతాధికారి

  హైకోర్టు తాజా తీర్పుతో ఇకపై జగనన్న విద్యా దీవెన డబ్బు.. విద్యార్థులు తల్లుల అకౌంట్లలో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించాల్సి ఉంటుంది. అయితే హైకోర్టు తీర్పుపై జగన్ సర్కార్ అప్పీల్‌కు వెళ్తుందా? లేక అమలు చేస్తుందా అన్నది చూడాలి.. తల్లుల ఖాతాలో పడేలా చేయాలని సీఎం జగన్ గట్టి సంకల్పం. ఇదే విషయాన్ని ఆయన పదే పదే చెబుతూ వచ్చారు.

  ఇదీ చదవండి:భార్య భర్తల మధ్య గొడవలో దూరడు.. ప్రాణాలే పోయాయి.. ఏం జరిగిందంటే..?

  ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం.. జగనన్న విద్యా దీవెన పథకాన్నితీసుకొచ్చారు. కరోనా కష్టకాలంలోనూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ మంత్రాన్ని వదలడం లేదు. ఇచ్చిన మాట ప్రకారమే.. ప్రకటించిన తేదీలకే పథకాలు అమలు చేస్తున్నారు.

  ఇదీ చదవండి:  తమిళనాడులో మెగా బ్రదర్స్ క్రేజ్.. అసెంబ్లీలో పవన్ ప్రస్తావన

  ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల అమలులో మాత్రం వెనుతిరిగి చూడటం లేదు. ఇందులో భాగంగానే పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివాలనే లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన రెండో విడత నిధులను ఈ ఏడాది జూలై 29 సీఎం జగన్ విడుదల చేశారు.

  ఇదీ చదవండి:రూపాయికే రుచికరమైన ఇడ్లీ.. నమ్మలేకపోతున్నారా నిజం.. మూడు రకాల చెట్నీలు కూడా.. ఎక్కడో తెలుసా..?

  అయితే జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడతలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు రూ. 693 కోట్లు విడుదల అయ్యాయి. కానీ మలి విడత నుంచి ఈ నగదును తల్లుల ఖాతాలోకి వేయడం కుదరదు.. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు