SHOCK TO TELANGANA GOVERNMENT EMPLOYEES OVER APRIL MONTH SALARY HERE FULL DETAILS NS
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. ఈ నెల కూడా పాత జీతాలే.. ఎందుకంటే..
సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందుకునే అదృష్టం ఈ నెలలో కూడా అందుకునే అవకాశం కనిపించడం లేదు. సీఎం కేసీఆర్ కు పీఆర్సీ ఫైల్ పై సంతకం చేయకపోవడంతో ఈ నెల కూడా పాత వేతనాలే అందుకోనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపుపై గ్రహణం ఇంకా వీడడం లేదు. అయితే మే లో పెరిగిన జీతం అందుకుంటామన్న ఆశతో ఉన్న ఉద్యోగులకు ఈ నెల కూడా మళ్లీ నిరాశే మిగలనుంది. సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన సీఎం ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. దీంతో ఆయన పీఆర్సీ కి సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో మే లో ఉద్యోగులు పెరిగిన వేతనాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో జూన్ నెల నుంచి పెరిగిన వేతనాలు అందుతాయని తెలుస్తోంది. ఏప్రిల్ నెల నుంచి 30 శాతం ఫిట్ మెంట్ ను అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.
అయితే.. సీఎం ప్రకటనతో అధికారులు పెరిగిన స్కేళ్లకు అనుగుణంగా ఫైల్ తయారు చేశారు. ఆమెదం కోసం ఆ ఫైల్ ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. అయితే ఈ లోగా సీఎం కరోనా బారిన పడడంతో ఆ ఫైల్ పెండింగ్ లో పడింది. వాస్తవానికి ఈ నెల 22లోగా బిల్లులు తయారు చేసి ఆర్థిక శాఖకు పంపిస్తేనే 1 వ తేదీన ఉద్యోగులకు వేతనాలు అందుతాయి. అయితే ఇప్పటికే 23 వ తేదీ వచ్చేయడంతో కొత్త వేతనాలను ఉద్యోగులకు అందించే అవకాశం లేకుండే పోయింది. దీంతో ఈ నెల కూడా పాత వేతనాలను అందించేందుకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీతో పాటు రెమిడెసివర్ విషయంలో రాష్ట్రం విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఆర్డర్ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. కరోనా వ్యాక్సిన్ మాదిరిగానే రెమిడెసివిర్ మెడిసిన్‌ను కూడా వారి అదీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి హర్షవర్దన్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. కేంద్రానికి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాం అని ఈటల తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి.. కష్టకాలంలో ఆదుకోవాల్సిన అవసరం కేంద్రంపై ఉందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.