ప్రస్తుత జాబ్ మార్కెట్లో డేటా సైన్స్(Data Science), మెషిన్ లెర్నింగ్(Mission Learning), అనలిటిక్స్ రంగాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఈ సెక్టార్లలోని నిపుణులకు మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రంగాల్లోని నిపుణులు తమ స్కిల్స్‌ను(Skills) ప్రదర్శించడానికి ఢిల్లీ- ఎన్సీఆర్లోని శివ్ నాడార్ యూనివర్సిటీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. మెషిన్ లెర్నింగ్ పోటీలు నిర్వహించే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ మెషిన్హ్యాక్ (MachineHack) భాగస్వామ్యంతో శివ్ నాడార్ యూనివర్సిటీ అనలిటిక్స్ ఒలింపియాడ్ -2022 రెండో ఎడిషన్ పోటీలను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ace.snu.edu.in ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
అనలిటిక్స్ ఒలంపియాడ్ పోటీలు రెండు నెలల పాటు జరగనున్నాయి. ఈ హ్యాకథాన్ ఛాలెంజ్ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు బిజినెస్ అనలిటిక్స్‌లో స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్‌ను ప్రదర్శించాల్సి ఉంటుంది. తద్వారా వారి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి లేదా ప్రారంభించటానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడనుంది. వర్సిటీలో ఈ ప్రోగ్రామ్ డిసెంబర్ 13 వరకు కొనసాగుతుంది.
* నిపుణులకు భారీ డిమాండ్
శివ్ నాడార్ యూనివర్సిటీలోని అకాడమీ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక డీన్ డాక్టర్ బిబేక్ బెనర్జీ మాట్లాడుతూ.. “డేటా సైన్స్ నిపుణులకు అన్ని రంగాల్లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అయితే ఈ అదనపు డిమాండ్‌కు తగినంతగా నైపుణ్యం ఉన్న నిపుణులు ప్రతి సంవత్సరం పరిశ్రమలోకి ప్రవేశించడం లేదు. దీంతో డేటా సైంటిస్ట్‌లు తమ నైపుణ్యాలను ఇండస్ట్రీ లీడర్స్ ముందు యాక్సెస్ చేయడానికి, ప్రదర్శించడానికి అనలిటిక్స్ ఒలింపియాడ్ ఒక వేదికను అందిస్తుంది. ఇది రిలవెంట్ ఇండస్ట్రీ-రెడీ స్కిల్స్‌తో భవిష్యత్తు మార్గాలను ఆవిష్కరిస్తుంది.’ అని చెప్పారు.
* విజేతకు రూ లక్ష క్యాష్ ప్రైజ్..
ఈ పోటీల్లో డేటా సైటిస్ట్స్, మెషిన్ లెర్నింగ్ డెవలపర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పట్టు ఉన్న ఔత్సాహికులు పాల్గొని డేటా అండ్ అనలిటిక్స్ స్కిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుంది. విజేతకు రూ.1 లక్ష క్యాష్ ప్రైజ్ అందజేస్తారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.30,000, రూ.20,000 రివార్డ్ ఇస్తారు.
* టాప్ 10 అభ్యర్థులు జ్యూరీ రౌండ్‌కు..
అనలిటిక్స్ ఒలింపియాడ్-2022 పోటీలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో అభ్యర్థులకు ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్పై తమ విధానాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫారమ్‌లో అందించిన డేటాసెట్స్ ఆధారంగా వారు సొల్యూషన్స్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. లీడర్ బోర్డ్ ఆధారంగా మొదటి దశ మూల్యాంకనం చేయనున్నారు. మొదటి దశలో టాప్ 10 అభ్యర్థులు జ్యూరీ రౌండ్‌కు అర్హత సాధిస్తారు. వీరి నుంచి టాప్-3 మెంబర్స్‌ను సెలక్ట్ చేస్తారు. కాగా, ఒలింపియాడ్ ఫస్ట్ ఎడిషన్‌లో దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చినట్లు వర్సిటీ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cash prize, JOBS, University