Home /News /jobs /

SHAHEENA ATTARWALA A YOUNG WOMAN WHO GREW UP AS A MICROSOFT MANAGER FROM A MUMBAI SLUM HER LIFE IS AN IDEAL FOR MANY GH EVK

Shaheena Attarwala: ముంబై స్లమ్​ నుంచి మైక్రోసాఫ్ట్ మేనేజర్​గా ఎదిగిన యువతి.. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం

షహీనా అత్తర్వాలా

షహీనా అత్తర్వాలా

Shaheena Attarwala Success Story | కృషి, పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది విజేతలు నిరూపించారు. పేదరికాన్ని జయించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. వారి విజయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ముంబై స్లమ్​ ఏరియాకు చెందిన ఓ యువతి యువితి విజ‌య‌గాథ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
కృషి, పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతో మంది విజేతలు నిరూపించారు. పేదరికాన్ని జయించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. వారి విజయంతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ముంబై స్లమ్​ ఏరియా (Mumbai Slum Area)కు చెందిన ఓ యువతి జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. జనవరి 26 రిపబ్లిక్​ డే (Republic Day) సందర్భంగా పేదరిక నిర్మూలన గురించి గొప్ప సందేశాన్ని అందించడానికి తన జీవిత ప్రయాణాన్ని, ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న విషయాలను ట్విట్టర్​ వేదికగా పంచుకుంది. ఇప్పుడు ఆమె ట్వీట్​ వైరల్​గా మారుతోంది. ఆమె పేరు.. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్​ (Microsoft) లో డిజైనర్​ లీడ్​గా పనిచేస్తున్న షహీనా అత్తర్వాలా.

Rail Protests: అస‌లు పేరు, ఊరు తెలియ‌దు.. ఎవ‌రీ "ఖాన్ సార్‌".. రైల్వే ప‌రీక్ష‌ల నిర‌స‌న‌లో అత‌ని పాత్ర ఏమిటీ?

షహీనా కుటుంబం బాంద్రా రైల్వే స్టేషన్​ (Bhadra railway station)కు సమీపంలోని దర్గా గల్లి మురికివాడలో నివసించేది. ఆమె తండ్రి సుగంధ నూనెల వ్యాపారి. రోజంతా సైకిల్​పై తిరుగుతూ నూనె అమ్మేవారు. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకునేవారు. అత్తర్వాలా నివసించే మురికివాడలో ఉన్న పరిస్థితులు, అక్కడి మహిళల దీనస్థితిని చూసి ఎలాగైనా ఉన్నత స్థాయికి ఎదగాలని నిర్ణయించుకుంది.‘నా చిన్నతనంలో జీవితం చాలా కష్టంగా ఉండేది. లింగ పక్షపాతం, లైంగిక వేధింపులు ఎక్కువగా ఉండేవి. 15 సంవత్సరాల వయసులో నా చుట్టూ ఉన్న చాలా మంది స్త్రీలు నిస్సహాయంగా, ఇతరులపై ఆధారపడి జీవించేవారు. వారంతా దుర్వినియోగానికి గురయ్యేవారు. వారికంటూ సొంత నిర్ణయాలు ఉండేవి కాదు. వారు కోరుకున్నట్లుగా జీవించేవారు కాదు. వారిలా తన జీవితం కాకూడదని నిర్ణయించుకున్నా.

RRB Group D Exam: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డీ ప‌రీక్ష‌ల్లో భారీ మార్పు.. ఒక‌టి కాదు.. రెండు ప‌రీక్ష‌లు!

అందుకే చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాను. పాఠశాలలో మొదటిసారిగా కంప్యూటర్​ని చూశాను. కంప్యూటర్​ నేర్చుకుంటే, మంచి అవకాశాలు దొరుకుతాయని అప్పుడే అనిపించింది. అయితే, నా కుటుంబ పరిస్థితి కారణంగా కుట్టు​ పని చేయాల్సి వచ్చింది. కూడబెట్టుకున్న డబ్బుతో కంప్యూటర్ శిక్షణ తీసుకున్నాను. కంప్యూటర్​ను కొనుగోలు చేయడానికి భోజనాలు కూడా మానేసిన సందర్భాలు ఉన్నాయి.’ అని షహీనా చెప్పారు.

మైక్రోసాఫ్ట్​లో ప్రొడక్ట్​ డిజైన్​ మేనేజర్​గా..

కాగా, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015లో ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత 2020లో బెంగళూరులోని మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ప్రోడక్ట్​ డిజైన్​ మేనేజర్​గా ఎంపికైంది. ప్రస్తుతం ఎక్స్‌పీరియన్స్ డిజైన్ మేనేజర్‌గా (Manager) పనిచేస్తుంది. “మీపై మీకు నమ్మకం లేకుంటే, ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు. పేదరికంలో ఉన్నామని దిగాలు చెందవద్దు. కష్టపడితే మురికివాడలో నివసించే వారు సైతం గొప్ప విజయాలు సాధించవచ్చు. అందుకు నా జీవితమే గొప్ప ఉదాహరణ.” అని ట్విట్టర్ (Twitter) ​లో రాసుకొచ్చారు. కాగా, అత్తర్వాలా కథ నుంచి ప్రేరణ పొందిన ఎంతో మంది ఆమెను ప్రశంసిస్తున్నారు. "మీ కథను పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ స్పూర్తివంతమైన జీవితం ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తుంది." అని ట్విట్టర్ యూజర్లు ఆమె పోస్ట్‌కు కామెంట్లు పెడుతున్నారు.
Published by:Sharath Chandra
First published:

Tags: Microsoft, Mumbai, Success story

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు