SEBI Internship: సెబీలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్... అప్లై చేయండిలా

SEBI Internship 2020 | ఇంటర్న్‌షిప్ చేయాలనుకునేవారికి మంచి అవకాశం ఇస్తోంది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI. ఆ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: May 29, 2020, 11:16 AM IST
SEBI Internship: సెబీలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్... అప్లై చేయండిలా
SEBI Internship: సెబీలో ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్... అప్లై చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI వరుసగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే 147 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. సెబీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ పాలసీ అనాలిసిస్ 2020-21 కోసం ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది సెబీ. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ గడువు 12 నెలలు మాత్రమే. ఫుల్ టైమ్ పీహెచ్‌డీ చేస్తున్న భారతీయ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 జూన్ 10 లోగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల్ని పోస్టులో పంపడంతో పాటు నోటిఫికేషన్‌లో సూచించిన ఇ-మెయిల్ ఐడీకి కూడా పంపాలి. ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

SEBI Internship 2020: ఇంటర్న్‌షిప్ వివరాలివే...



దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 10
విద్యార్హత- ఫుల్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో రెండేళ్లు పూర్తి చేసి ఉండాలి. పార్ట్ టైమ్ పీహెచ్‌డీ చేస్తున్నవాళ్లు దరఖాస్తు చేయకూడదు. పీహెచ్‌డీ థీసిస్ ఫైనాన్షియల్ ఎకనమిక్స్ అంశంలో ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో పీజీ పాస్ కావాలి.
వయస్సు- 2020 ఏప్రిల్ 1 నాటికి 35 ఏళ్లు.
ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ.
స్టైపెండ్- నెలకు రూ.35,000దరఖాస్తులు పంపాల్సిన ఇమెయిల్ ఐడీ: prabhakarrp@sebi.gov.in
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Chief General Manager,
Department of Economic and Policy Analysis,
SEBI Bhavan, C 4 A G Block,
Bandra Kurla Complex,
Bandra East, Mumbai,
Maharashtra, India. 400051

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Govt Jobs: సెబీలో ఉద్యోగాలకు మరోసారి దరఖాస్తు గడువు పెంపు

DRDO Jobs: డీఆర్‌డీఓలో 185 ఉద్యోగాలు... రేపటి నుంచి దరఖాస్తులు

Jobs: హైదరాబాద్ వాటర్ బోర్డులో జాబ్స్... మే 31 చివరి తేదీ
Published by: Santhosh Kumar S
First published: May 29, 2020, 11:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading