భారతీయ రైల్వేలో (Indian Railways) ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) రిలీజ్ అవుతున్నాయి. అందులో భాగంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పలు ఖాళీలను (Railway Jobs) భర్తీ చేసేందుకు రెండు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. మొత్తం 771 పోస్టుల్ని ప్రకటించింది. బిలాస్పూర్ డివిజన్లో 432 పోస్టుల్ని, నాగ్‌పూర్ డివిజన్లో 339 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్రెంటీస్ గడువు ఏడాది మాత్రమే ఉంటుంది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, టర్నర్ లాంటి పోస్టులు ఉన్నాయి. మరి ఏ డివిజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, విద్యార్హతలేంటీ, ఎలా దరఖాస్తు చేయాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 432 |
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 90 |
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) | 15 |
స్టెనోగ్రాఫర్ (హిందీ) | 15 |
ఫిట్టర్ | 125 |
ఎలక్ట్రీషియన్ | 40 |
వైర్‌మ్యాన్ | 25 |
ఎలక్ట్రానిక్ మెకానిక్ | 6 |
ఆర్ఏసీ మెకానిక్ | 15 |
వెల్డర్ | 20 |
ప్లంబర్ | 4 |
పెయింటర్ | 10 |
కార్పెంటర్ | 13 |
మెషినిస్ట్ | 5 |
టర్నర్ | 5 |
షీట్ మెటల్ వర్కర్ | 5 |
డ్రాఫ్ట్‌మ్యాన్ సివిల్ | 4 |
గ్యాస్ కట్టర్ | 20 |
మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్ ప్యాథాలజీ | 3 |
మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్ కార్డియాలజీ | 2 |
మెకానిక్ మెడికల్ | 1 |
డెంటల్ ల్యాబ్ టెక్నీషియన్ | 2 |
ఫిజియోథెరపీ టెక్నీషియన్ | 2 |
హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ | 1 |
రేడియాలజీ టెక్నీషియన్ | 2 |
DRDO Recruitment 2021: రూ.54,000 వేతనంతో డీఆర్డీఓలో జాబ్స్... వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలివే
మొత్తం ఖాళీలు | 339 |
ఫిట్టర్ | 40 |
కార్పెంటర్ | 20 |
వెల్డర్ | 40 |
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ | 90 |
ఎలక్ట్రీషియన్ | 40 |
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్) | 26 |
ప్లంబర్ | 15 |
పెయింటర్ | 15 |
వైర్‌మ్యాన్ | 10 |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 4 |
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్ | 2 |
డీజిల్ మెకానిక్ | 35 |
ట్రిమ్మర్ | 2 |
దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 6
నాగ్‌పూర్ డివిజన్లోని పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 5
బిలాస్పూర్ డివిజన్లోని పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2021 అక్టోబర్ 10
విద్యార్హతలు- 10+2 పాస్ కావాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 2021 జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్లు
ఎంపిక విధానం- టెన్త్, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు.
అప్రెంటీస్ గడువు- ఒక ఏడాది
నాగ్‌పూర్ డివిజన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బిలాస్పూర్ డివిజన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 174 ఉద్యోగాలు... రూ.49,870 వేతనం
Step 1- అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Register పైన క్లిక్ చేసి Candidate పైన క్లిక్ చేయాలి.
Step 3- వ్యక్తిగత వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 4- ఆ తర్వాత రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ కావాలి.
Step 5- లాగిన్ అయిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెలెక్ట్ చేసి దరఖాస్తు చేయాలి.
Step 6- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Govt Jobs 2021, Indian Railway, Indian Railways, Job notification, JOBS, Railway Apprenticeship, Railway jobs, Railways